జీవితాంతం ఉండిపోతుందా?

గత ఏడాది చిన్న యాక్సిడెంట్‌లో ముఖానికి దెబ్బ తగిలింది. రక్తం ఏమీ రాలేదు. కానీ ఆ తర్వాత ఆ ప్రదేశమంతా నల్లగా మారింది. నెలలు గడిచినా పోవడం లేదు. జీవితాంతం అలానే ఉండిపోతుందా? పోగొట్టుకునే మార్గం చెప్పండి.

Published : 17 Dec 2021 00:39 IST

గత ఏడాది చిన్న యాక్సిడెంట్‌లో ముఖానికి దెబ్బ తగిలింది. రక్తం ఏమీ రాలేదు. కానీ ఆ తర్వాత ఆ ప్రదేశమంతా నల్లగా మారింది. నెలలు గడిచినా పోవడం లేదు. జీవితాంతం అలానే ఉండిపోతుందా? పోగొట్టుకునే మార్గం చెప్పండి.

- నీతా, హైదరాబాద్‌

దీన్ని పోస్ట్‌ ఇన్‌ఫ్లమేటరీ హైపర్‌ పిగ్మెంటేషన్‌ అని కూడా అంటారు. ఇది మన భారతీయుల్లో సర్వ సాధారణం. అంటే దెబ్బ తగిలిన తర్వాత ఆ ప్రదేశం నల్లగా మారడమన్నమాట. ఇది పోవడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. కొందరిలో వంశపారంపర్యం, వాతావరణ అంశాలూ కారణమవుతాయి. ఉదయం, రాత్రి మాయిశ్చరైజర్‌ తప్పక రాయాలి. వీలైనంత వరకూ ఎండలోకి వెళ్లొద్దు. తప్పక వెళ్లాల్సొస్తే సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి. మీ చర్మతత్వాన్ని బట్టి హైడ్రోక్వినాన్‌, ట్రెటినాయిన్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌, ఎజిలాయిక్‌ యాసిడ్‌ క్రీమ్‌లను వాడాలి. వీటిని రాత్రిపూట సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. పైన తగిలిన దెబ్బ అయితే ఈ క్రీమ్‌లతో తగ్గిపోతుంది.

లేదా.. స్పూను టమాటా గుజ్జుకు టేబుల్‌ స్పూను చొప్పున ఓట్‌మీల్‌, పెరుగు కలిపి ముఖానికి పూసి, పది నిమిషాల తర్వాత కడిగేయాలి. 3 స్పూన్ల నారింజ రసానికి టేబుల్‌ స్పూను చొప్పున పెరుగు, తేనె కలిపి రాసుకుని 20 నిమిషాలయ్యాక శుభ్రం చేసుకోవాలి. కీరా గుజ్జుకు కొన్నిపాలు, టేబుల్‌ స్పూను చొప్పున తేనె, బ్రౌన్‌షుగర్‌ కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాలాగి కడిగేసుకోవాలి. సగం ఆపిల్‌, 7 ద్రాక్ష పండ్లు కలిపి మెత్తగా చేసిన పేస్ట్‌ను ముఖానికి పట్టించి అరగంట ఉంచాలి. సగం అరటి పండు గుజ్జుకు స్పూను చొప్పున తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసి, 30 నిమిషాల పాటు ఉంచుకున్నా ఫలితం ఉంటుంది. ఇవన్నీ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

కొంత లోతుగా తగిలితే మాత్రం కెమికల్‌ పీల్స్‌, లేజర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. గ్లైకాలిక్‌ యాసిడ్‌, మాండాలిక్‌ యాసిడ్‌, లాక్టిక్‌ యాసిడ్‌ పీల్స్‌ చేయించుకోవచ్చు. ఫ్రాక్షనల్‌ లేజర్‌, నాన్‌ ఎబిలేటివ్‌ లేజర్స్‌ కూడా పిగ్మెంటేషన్‌ను లైట్‌ చేస్తాయి. దాదాపుగా క్రీమ్‌లతోనే తగ్గిపోతాయి. కాకపోతే కొంచెం టైమ్‌ పడుతుందంతే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్