ఆమెను అమ్మలా అంగీకరించలేకపోతున్నా...

నేను ఇంటర్‌ చదువుతున్నాను. అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత నాన్న ఎదురింటి ఆంటీ వాళ్ల చెల్లెలిని పెళ్లి చేసుకున్నారు. అమ్మ బతికి ఉన్నప్పుడే వీళ్లిద్దరికీ సంబంధం ఉందనే విషయం బంధువులు, స్నేహితుల ద్వారా ఈమధ్యే తెలిసింది.

Published : 22 Jan 2022 01:25 IST

నేను ఇంటర్‌ చదువుతున్నాను. అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత నాన్న ఎదురింటి ఆంటీ వాళ్ల చెల్లెలిని పెళ్లి చేసుకున్నారు. అమ్మ బతికి ఉన్నప్పుడే వీళ్లిద్దరికీ సంబంధం ఉందనే విషయం బంధువులు, స్నేహితుల ద్వారా ఈమధ్యే తెలిసింది. ఆమెను అమ్మలా అంగీకరించలేకపోతున్నా. నాన్న మీద గౌరవం పోయింది. ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తోంది. ప్రశాంతంగా చదవలేకపోతున్నా.

- ఓ సోదరి, హైదరాబాద్‌

ఇంటర్‌ చదువుతున్నావంటే పరిపక్వత చెందే వయసు వచ్చింది. మీ అమ్మా నాన్నా ఇద్దరూ నీకు ముఖ్యమైన వాళ్లే. అమ్మ అర్ధాంతరంగా చనిపోవడం  దురదృష్టకరం. నాన్న ఇంకో పెళ్లి చేసుకోవడం వల్ల నీక్కూడా ఒక ఆలంబన దొరికిందన్న సంగతి  గమనించాలి. ఆయనకు ఆమెతో ముందుగానే సంబంధం ఉందో లేదో అనవసరం. కన్నతల్లితో మరెవరూ సమానం కాని మాట నిజమే అయినా, ఆమెని చేసుకోవడం వల్ల ఒక కుటుంబం ఏర్పడుతోందని ఆశావహంగా ఆలోచించు.ఆవిడతో మంచిగా ఉంటే ఆమె కూడా నిన్ను కావాలనుకుంటుంది. అమ్మానాన్నల ప్రేమ, సహకారం నీకు దొరుకుతాయి. భార్య చనిపోయి, పిల్లలున్నా మీ జీవితంలోకి వచ్చిందంటే ఆమెది ఔదార్యం. ఒకవేళ మీ నాన్న, ఆమెని ముందుగానే ఇష్టపడినా, మీ అమ్మ చనిపోవడానికీ దానికీ సంబంధం ఉండదు. కనుక అపోహలు వద్దు. ఆమె ఆలంబనగా నిలవబోతే దాన్ని అందుకోకుండా వ్యతిరేకత పెంచుకుంటే ఎలా? నువ్వు ఆమెని అయిష్టంగా చూస్తే మీ ఇద్దరి మధ్య బంధం దెబ్బతింటుంది. నేను నాన్నకి, ఇంటికి చేయలేని పనులు ఇంకో ఆవిడొచ్చి చేస్తోంది అనుకో! లేదంటే అవన్నీ నువ్వే చేయాల్సివచ్చేది! మారుతున్న కాలంలో ఇలాంటివాటిని అంగీకరించాలి. విశాల దృక్పథంతో చూస్తే అంతా సానుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సరేనంటావో నీకూ మనశ్శాంతి ఉంటుంది, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్