మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడు.

నేనో డైవర్సీతో ఏడాదిగా సహజీవనం చేస్తున్నా. ఆరు నెలలకే అతడు చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. అతడికి ఎలాంటి సంపాదనా లేదు. చిన్న చిన్న ఖర్చులకు కూడా నేనే డబ్బులివ్వాలి. సెక్స్‌ విషయంలో అసహజంగా ప్రవర్తిస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఇతడి మీద కేసు పెట్టడానికి అవకాశం....

Updated : 26 Jan 2022 13:48 IST

* నేనో డైవర్సీతో ఏడాదిగా సహజీవనం చేస్తున్నా. ఆరు నెలలకే అతడు చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. అతడికి ఎలాంటి సంపాదనా లేదు. చిన్న చిన్న ఖర్చులకు కూడా నేనే డబ్బులివ్వాలి. సెక్స్‌ విషయంలో అసహజంగా ప్రవర్తిస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఇతడి మీద కేసు పెట్టడానికి అవకాశం ఉందా? ఇది గృహహింస చట్టం పరిధిలోకి వస్తుందా? నేను భార్యను కాదు. సహజీవనమే చేస్తున్నా. నాకు హక్కులు ఉంటాయా?

- ఓ సోదరి, హైదరాబాద్‌

* మీకు పెళ్లి అయ్యిందో లేదో తెలియలేదు. ఎందుకంటే మీకు పెళ్లై విడాకులు తీసుకోకుండా అతనితో కలిసి ఉంటే అది సహజీవనం కిందకు రాదు. మీకు పెళ్లి కాకుండా, అతను కూడా డైవోర్సీ అయి ఇద్దరూ కలిసి జీవించడం సహజీవనం కిందకు వస్తుంది. గృహహింస చట్టం, సెక్షన్‌ 2(ఎఫ్‌) ప్రకారం డొమెస్టిక్‌ రిలేషన్‌షిప్‌లో ఇద్దరూ కలిసి జీవించడం ‘ఇన్‌ ద నేచర్‌ ఆఫ్‌ మ్యారేజ్‌’ అంటే వివాహితులులాగా జీవించడాన్ని కూడా చేర్చారు. కాబట్టి మీరు గృహహింస చట్టం 2005సెక్షన్‌ 3(ఎ) కింద చెప్పబడిన శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక వేధింపులను చేర్చి అతని మీద ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. మీకు దగ్గరలోని ప్రొటెక్షన్‌ అధికారి ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని అతడిని పిలిపించి మాట్లాడటమో, కౌన్సెలింగ్‌ చేయడమో చేస్తారు. వారి ద్వారా న్యాయం జరగదని భావించినప్పుడు ఆ కేసును క్రిమినల్‌ కోర్టుకి పంపుతారు. మీ రక్షణ కస్టడీ కోసం మిమ్మల్ని షెల్టర్‌ హోమ్స్‌కి పంపుతారు. వైద్య పరీక్షలు అవసరమైతే చేయిస్తారు. గృహహింస చట్టం సెక్షన్‌ 17 కింద ఇంటిలో నివసించే హక్కు, సెక్షన్‌- 18 కింద ప్రొటెక్షన్‌ ఆర్డర్‌, సెక్షన్‌-19 కింద ఇంటిలో ఉండే హక్కు, సెక్షన్‌20 కింద మీకు రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్‌ లాంటివి పొందడానికి హక్కు ఉంటుంది. సెక్షన్‌ 22 కింద మీరు పడ్డ కష్టానికి, అనుభవించిన మానసిక క్షోభకు తగిన కాంపెన్‌సేషన్‌ కూడా పొందొచ్చు. వీలైనంత తొందరగా ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ని కలవండి. వారు మీకు ఫిర్యాదు ఎలా రాయాలో కూడా తెలియజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్