ఈ ఆసనంతో ప్రశాంతత...

ఈ కాలంలో పొద్దున్నే లేవాలంటే కొంచెం విసుగ్గానే ఉంటుంది. అది సహజమే. కానీ ఒకసారి లేచి కాసేపు యోగా చేశారంటే ఆ బద్ధకం కాస్తా హుష్‌కాకీ అన్నట్టు ఎగిరిపోతుంది. ముఖ్యంగా శీర్షాంగుష్ట

Updated : 15 Aug 2022 15:29 IST

ఈ కాలంలో పొద్దున్నే లేవాలంటే కొంచెం విసుగ్గానే ఉంటుంది. అది సహజమే. కానీ ఒకసారి లేచి కాసేపు యోగా చేశారంటే ఆ బద్ధకం కాస్తా హుష్‌కాకీ అన్నట్టు ఎగిరిపోతుంది. ముఖ్యంగా శీర్షాంగుష్ట యోగాసనం ఒత్తిడిని తగ్గించి శారీరక అలసటను పోగొడుతుంది. మానసిక ప్రశాంతతను తెచ్చిపెడుతుంది.

ఇది నిలబడి చేసే ఆసనం. రెండు కాళ్లనూ సాధ్యమైనంత వంచాలి. తర్వాత నెమ్మదిగా కుడి మోకాలిని 30 డిగ్రీలు పక్కకు ఉండేలా చూడాలి. ఎడమకాలిని తిన్నగా ఉంచి తలను కుడి కాలి పాదం మీద ఆనించాలి. రెండు చేతులూ వెనక్కి పెట్టుకుని వేళ్లను ముడివేసినట్లుంచి చేతులను 90 డిగ్రీలు పైకి తీసుకురావాలి. ఒకవేళ ఎవరికైనా చేతులు పైకి రాకపోతే రెండు చేతులూ కింద పెట్టి కూడా ఈ ఆసనం చేయొచ్చు. ఇలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. మళ్లీ ఇలాగే ఎడమకాలితో చేయాలి. ఈ యోగాసనం వల్ల శరీరం చురుగ్గా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఆందోళన, అలజడీ ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్