నేనేమైనా హద్దు మీరానా అనిపిస్తోంది.. ఇక్కడ తప్పు నాదేనా?

నేనో టెక్‌ మేనేజర్‌ని. ఏళ్ల అనుభవముంది. ఇటీవలే సంస్థలో ఓ కొత్త వ్యక్తి నియమితుడయ్యాడు. పనిలో భాగంగా అతనితో నేను మాట్లాడాల్సిందే. చాలా సార్లు తను చెప్పేదానికీ, పనికీ పొంతనే ఉండదు.

Updated : 30 Mar 2022 17:14 IST

నేనో టెక్‌ మేనేజర్‌ని. ఏళ్ల అనుభవముంది. ఇటీవలే సంస్థలో ఓ కొత్త వ్యక్తి నియమితుడయ్యాడు. పనిలో భాగంగా అతనితో నేను మాట్లాడాల్సిందే. చాలా సార్లు తను చెప్పేదానికీ, పనికీ పొంతనే ఉండదు. అతని సహోద్యోగితో మాటల్లో ‘ఆ కొత్త వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో తనకైనా తెలుసా? ఎక్కువ సార్లు పనికి రానివే మాట్లాడతాడ’న్నా. తనూ నాదీ అదే అభిప్రాయమన్నాడు. ఇద్దరం నవ్వుకుని వదిలేశాం. కొన్ని గంటల తర్వాత అతని బాస్‌ ‘అలా ఎలా మాట్లాడతావు. నీకేదైనా సమస్య ఉంటే నన్నడుగ’ంటూ కోపగించుకున్నారు. నాకు నిజంగా అది పెద్ద విషయంగా అనిపించలేదు. నేనేమైనా హద్దు మీరానా? ఈ కొత్త వ్యక్తి లోపాలను గతంలోనే మేనేజర్‌కి సూచించా. ఆయనే పట్టించుకోలేదు. ఇక్కడ తప్పు నాదేనా?          

- శివజ్యోతి

అనధికార సంభాషణలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి త్వరగా వదంతులుగా మారగలవు. తోటి వారు విని ఊరుకుంటే సమస్య ఉండదు. కానీ వాళ్లు అలా వదిలేస్తారా? మీ బృందంలో వారైనా పక్క వారైనా ఎవరినీ ఈ విషయంలో నమ్మొద్దు అనే సూత్రాన్ని గుర్తుంచుకోండి. మీ ‘పనికి రాని మాటలే’ అన్న కామెంట్‌ నిజంగా పెద్ద విషయమా కాదా అన్నది అక్కడ మీ సంభాషణను బట్టి ఉంటుంది. ఉదాహరణకు- మీ అభిప్రాయాన్నే నేరుగా చెప్పేయకుండా.. ఆ కొత్తవ్యక్తి సహోద్యోగితో ‘పని ఎలా సాగుతోంది’, ‘కొత్త అతను కుదురుకున్నాడా?’ లాంటి వాటి ద్వారా సమాచారం సేకరణలో భాగంగా అనుంటే ఫర్లేదు. అలా కాకపోతేనే సమస్య.

బాస్‌లు ఎలా ఆలోచిస్తారో అర్థం చేసుకోగలను. తోటి వారితో సమస్య ఉంటే దాన్ని తమ దృష్టికి తీసుకు రావాలని వారు ఆశిస్తారు. అందులో తప్పులేదు. ఇంకోటేంటంటే.. ఆయన నేరుగా మిమ్మల్ని కోప్పడటం. మీ ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు లేవు కదా! నిజానికి మీరు నోరు జారినా.. మీ అభిప్రాయాన్ని ఉదాహరణలతో మళ్లీ చెప్పే ప్రయత్నం చేయండి. ఇక బంధం చెడకూడదంటే.. ‘మీ ఆలోచనల్ని నేనర్థం చేసుకోగలను. ఇప్పుడు నన్నేం చేయమంటారు’ అని అడగొచ్చు. అవతలి వ్యక్తీ అదే కోరుకుంటున్నారా? లేదా ఈ విషయం కొత్త వ్యక్తికి తెలిసి, తనే మీమధ్య దూరానికి కారణమయ్యాడా అనేదీ తెలుస్తుంది. దాన్నిబట్టి తగినదేదో చేస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్