గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతోంది...

మా అమ్మకి  46 ఏళ్లు. రోజుకు ఐదారు గంటలసేపు తన అక్కచెల్లెళ్లు, స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతుంది. ఆ మాటల్లో ఎక్కువ శాతం ఎవరో ఒకరిమీద ఫిర్యాదులే. అందులో మునిగిపోతే తినడం కూడా గుర్తుండదు.

Updated : 19 Mar 2022 06:06 IST


మా అమ్మకి  46 ఏళ్లు. రోజుకు ఐదారు గంటలసేపు తన అక్కచెల్లెళ్లు, స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతుంది. ఆ మాటల్లో ఎక్కువ శాతం ఎవరో ఒకరిమీద ఫిర్యాదులే. అందులో మునిగిపోతే తినడం కూడా గుర్తుండదు. అది ఆరోగ్యానికి మంచిది కాదని ఎంత చెప్పినా వినడంలేదు. అమ్మలో మార్పు రావాలంటే ఏం చేయాలి?

- ఒక సోదరి, నెల్లూరు

మునుపు ఫోన్లు ఉండేవి కాదు కనుక ఇరుగు పొరుగువారితో కాలక్షేపం చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. పైగా పిల్లలు పెద్దయిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఆవిడకి చాలా సమయం మిగిలి బంధు మిత్రులతో మాట్లాడుతుండొచ్చు. ఒకరిని తప్పుపట్టడం, తూలనాడటంలాంటి విషయాల్లో కొందరికి ఆనందం ఉంటుంది. మీ అమ్మగారిది సహజంగా పెద్దగా మాట్లాడని తత్వం అయ్యుండి ఈమధ్య మార్పు వచ్చి అతిగా మాట్లాడుతూ, ఇతరులను తప్పుపడుతుంటే బైపోలార్‌ డిజార్డర్‌ లాంటి మానసిక రుగ్మత ఉందేమో డాక్టరుకు చూపించండి! కుటుంబంలో మరెవరికైనా ఇలా ఎక్కువసేపు మాట్లాడటం, అతిగా డబ్బు ఖర్చుపెట్టడం, అత్యుత్సాహం, ప్రగల్భాలు పలకడం, సైకలాజికల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం- లాంటివి ఉంటే మాత్రం వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించండి. అలాంటి సమస్యేమీ లేదంటే.. ఇంట్లో వాళ్ల మాట వినడం లేదు కనుక కౌన్సిలర్‌ దగ్గరికి తీసికెళ్లండి. టైం మేనేజ్‌మెంట్‌, సృజనాత్మక అంశాల్లో తర్ఫీదిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్