అప్పట్నుంచే.. ఈ సమస్య!

పాప వయస్సు 14 ఏళ్లు. ఇటీవలే రజస్వల అయ్యింది. అప్పట్నుంచీ ముఖంపై చిన్న చిన్న దద్దుర్లు, మొటిమలు వస్తున్నాయి. రాకుండా ఏం చేయాలి?

Published : 17 Jul 2022 02:27 IST

పాప వయస్సు 14 ఏళ్లు. ఇటీవలే రజస్వల అయ్యింది. అప్పట్నుంచీ ముఖంపై చిన్న చిన్న దద్దుర్లు, మొటిమలు వస్తున్నాయి. రాకుండా ఏం చేయాలి?

- ఓ సోదరి

టీనేజర్లకు యాక్నే రావడం సాధారణ విషయమే. వీటిలోనూ బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌హెడ్స్‌, చీముతో కూడినవి, తర్వాత పెద్ద పెద్ద గడ్డల్లా రావడం.. ఇలా చాలా ఉంటాయి. ఎక్కువగా నూనెలు విడుదలవ్వడం, వాటికి మృతకణాలు తోడైతే చర్మ రంధ్రాలు మూసుకుపోయి ఇవి వస్తుంటాయి. ఇంకా టెస్టోస్టిరాన్‌ ఎక్కువగా విడుదలవ్వడం, హార్మోనుల్లో అసమతుల్యత వంటివీ కారణమవుతాయి. వీటిని తక్కువ, మధ్యస్థం, విపరీతంగానూ విభజించొచ్చు. మీ పాపకి మధ్యస్థమే. చాలామంది ఆహారాన్ని కారణంగా చూపిస్తారు. కానీ దాని ప్రభావం చాలా తక్కువ. అయితే యాక్నే ఏర్పడినప్పుడు చాలాసార్లు పాల పదార్థాలకు మాత్రం దూరంగా ఉండమని చెబుతాం. ఒత్తిడి, వాతావరణంలోని దుమ్ము వంటివీ ప్రభావం చూపుతాయి. హెల్మెట్‌, క్యాప్స్‌ వంటివీ కారణమవుతాయి.

ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ను తప్పక రాయాలి. తర్వాతా ప్రతి రెండు గంటలకోసారి రాయాలి. జెల్‌ ఆధారితమైన వాటిని వాడితే మంచిది. యాక్నే ఉంటే మాయిశ్చరైజర్‌ రాయకూడదు అనుకుంటారు కానీ.. చర్మం పొడిబారి మరిన్ని సమస్యలకు దారి తీయొచ్చు. కాబట్టి, తప్పక రాయాలి. వైద్యుల సలహామేరకు యాంటీ యాక్నే ప్రొడక్ట్స్‌ తెచ్చుకోండి. బెంజైల్‌ పెరాక్సైడ్‌ వాడొచ్చు. సాల్సిసిక్‌ యాసిడ్‌ కొత్త తప్పిదాలు జరగకుండా చూసుకుంటుంది. రెటినాల్‌ చర్మ రంధ్రాలను బాగు చేయడమే కాక నల్ల వలయాల్నీ తొలగిస్తుంది. కొత్త ఉత్పత్తులు, మేకప్‌కు దూరంగా ఉండాలి. వాడాల్సొస్తే మినరల్‌ మేకప్‌ లేదా నాన్‌కమడోజెనిక్‌ వాటిని ఎంచుకోవాలి. రసాయనాల్లేని క్లెన్సర్‌ వాడాలి. ఆరోగ్యకర ఆహారం, యోగా, వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవన్నీ దద్దుర్లు, మొటిమల్ని దూరంగా ఉంచుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్