మొటిమలకు చెక్‌!

నాకు 14 ఏళ్లు. ముఖమంతా మొటిమలు, నల్లమచ్చలే. పోగొట్టుకోవడానికి సాయపడే ఉదయం, రాత్రి స్కిన్‌కేర్‌ రోటీన్‌ సూచించగలరా?

Published : 31 Jul 2022 02:10 IST

నాకు 14 ఏళ్లు. ముఖమంతా మొటిమలు, నల్లమచ్చలే. పోగొట్టుకోవడానికి సాయపడే ఉదయం, రాత్రి స్కిన్‌కేర్‌ రోటీన్‌ సూచించగలరా?

- ఓ సోదరి

దీన్ని యాక్నే అంటారు. చర్మరంధ్రాలు మృతకణాలు, దుమ్ముతో మూసుకుపోవడం వల్ల వస్తుంటాయివి. నూనెలు ఎక్కువగా విడుదలవ్వడం వల్లా కూడా వస్తుంటాయి. బ్యాక్టీరియా, మాస్క్‌లు, హెల్మెట్‌, కొన్ని రకాల ఔషధాలు వాడటం కూడా యాక్నేకు కారణమవుతాయి. సబ్బు కాకుండా మైల్డ్‌ ఫేస్‌వాష్‌ను రోజుకు రెండుసార్లు వాడాలి. మొటిమలనగానే మాయిశ్చరైజర్‌ రాయకూడదనుకుంటారు. కానీ చర్మతీరుకు తగ్గదాన్ని తప్పక రాయాలి. దీంతోపాటు పగలైతే కనీసం ఎస్‌పీఎఫ్‌ 30 ఉన్న జెల్‌ ఆధారిత సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడాలి. బయటకు వెళ్లడానికి కనీసం పావుగంట ముందు దీన్ని రాయాలి. ఎండలో ఉండాల్సి వస్తే ప్రతి రెండు గంటలకోసారి రాస్తూ ఉండాలి. దానిపై  బెంజైల్‌ పెరాక్సైడ్‌, టాపికల్‌ రెటినాయిడ్స్‌, క్లెండమైసిన్‌ వంటి క్రీములు రాయాలి. రాత్రి మాయిశ్చరైజర్‌, టాపికల్‌ క్రీములు రాస్తే సరిపోతుంది. దాదాపుగా తగ్గిపోతుంది. వీటితో తగ్గనప్పుడు యాంటీబయాటిక్స్‌ తీసుకోవాలి. ఇంకా.. మచ్చలకు బ్లూ, రెడ్‌ లైట్‌ థెరపీలని తీసుకోవచ్చు. దీంతో బ్యాక్టీరియా చనిపోతుంది. పల్స్‌డ్‌ లైట్‌ లేజర్‌తో మచ్చలు పోతాయి. కెమికల్‌ పీల్స్‌ కూడా మొటిమలు తగ్గించడంతోపాటు మృతకణాలు తొలగించడానికీ సాయపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్