ముఖంపై ఈ పొక్కులేంటి?

ఇవీ మొటిమలే. చర్మంలో నూనెలు ఎక్కువగా విడుదలైనా, మృతకణాలు చర్మరంధ్రాల్లో ఇరుక్కుపోయినా వస్తుంటాయి. కొన్నిసార్లు టెస్టోస్టిరాన్‌ ఎక్కువగా విడుదలైనా, నెలసరి సరిగా రాకపోయినా ఇలాగే జరుగుతుంది. ఒత్తిడి, వాతావరణంలో మార్పులూ, మాస్క్‌లు పెట్టుకోవడం వంటివీ కారణమే. టీనేజీలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.

Published : 07 Aug 2022 00:42 IST

వయసు 18. ముఖం మీద చీముతో పొక్కుల్లా వస్తున్నాయి. అసలేంటివి? ఎందుకొస్తాయి? పోవాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

వీ మొటిమలే. చర్మంలో నూనెలు ఎక్కువగా విడుదలైనా, మృతకణాలు చర్మరంధ్రాల్లో ఇరుక్కుపోయినా వస్తుంటాయి. కొన్నిసార్లు టెస్టోస్టిరాన్‌ ఎక్కువగా విడుదలైనా, నెలసరి సరిగా రాకపోయినా ఇలాగే జరుగుతుంది. ఒత్తిడి, వాతావరణంలో మార్పులూ, మాస్క్‌లు పెట్టుకోవడం వంటివీ కారణమే. టీనేజీలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. నూనెలు ఎక్కువగా తినడం వల్ల ఇలా జరుగుతుందని చాలామంది అనుకుంటారు. అది అపోహే. అయితే పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకునే వారిలో మాత్రం ఈ యాక్నే సమస్యలుంటాయి.

బెంజైల్‌ పెరాక్సైడ్‌, సాల్సిలిక్‌ యాసిడ్‌, రెటినాల్‌ ఉన్న క్రీములను రాయండి. వీటికి తగ్గకపోతే ఓరల్‌ యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. సిప్రోమైసిన్‌, క్లెండమైసిన్‌ వంటివి వాడాలి. వీటికి తగ్గిపోతుంది. వీటితోపాటు రెటినాయిక్‌ యాసిడ్‌, సాల్సిలిక్‌ యాసిడ్‌ వంటి కెమికల్‌ పీల్స్‌నీ చేస్తాం. వీటితో యాక్నేతోపాటు వాటి తాలూకు మచ్చలూ పోతాయి. మీరు వాడే ఉత్పత్తులు చర్మరంధ్రాలను మూసేసేవిగా ఉండకుండా చూసుకోండి. జుట్టు ముఖంపై పడటం, అతి మేకప్‌లకీ దూరంగా ఉండాలి. వారానికి రెండుసార్లు మించి ఏరకమైన స్క్రబ్‌ కూడా చేయొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్