ఇవేం పుట్టుమచ్చలు!

వయసు 23. ముఖం మీద పుట్టుమచ్చల్లా వస్తున్నాయి. మొదట డల్‌గా మొదలై తర్వాత పెద్దగా అవుతున్నాయి. అసలేంటివి? పోగొట్టుకునే మార్గం చెప్పండి.

Published : 14 Aug 2022 01:57 IST

వయసు 23. ముఖం మీద పుట్టుమచ్చల్లా వస్తున్నాయి. మొదట డల్‌గా మొదలై తర్వాత పెద్దగా అవుతున్నాయి. అసలేంటివి? పోగొట్టుకునే మార్గం చెప్పండి.

- ఓ సోదరి

మెలనోసైట్లు ముద్దలుగా ఏర్పడటం మూలాన ఈ మచ్చలు వస్తాయి. 50 ఏళ్ల వరకూ 10-40 వరకూ సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇవి పుట్టినప్పుడే ఏమీ ఉండవు. వయసు పెరిగేకొద్దీ కనిపిస్తుంటాయి. వీటిలోనూ చాలా రకాలు ఉంటాయి. పుట్టుకతో వచ్చేవి కాన్‌జెనైటల్‌ మోల్స్‌, ఇవే సైజులోనైనా ఉండొచ్చు. అక్వైర్డ్‌ మోల్స్‌.. ఎప్పుడైనా రావొచ్చు. ఇవి రంగు తగ్గడం, పెరగడం సాధారణమే. ఏటింపికల్‌ మోల్స్‌.. 6 మి.మీ. కంటే పెద్దగా ఉంటాయి. ఇవి ఒకటి లేదా గుంపుగానూ ఉండొచ్చు. చాలావరకూ వీటివల్ల ప్రమాదమేమీ ఉండదు. కొద్ది సందర్భాల్లో మాత్రం క్యాన్సర్‌గా మారే అవకాశముంది. యవ్వనంలోకి వచ్చాక, గర్భం దాల్చినపుడు, హార్మోనుల్లో మార్పులొస్తున్నప్పుడు రంగు మారడం సహజమే. కానీ పుట్టుమచ్చ కనుక ఒక ఆకారమంటూ లేకుండా పెరుగుతూ, రంగు మారుతోంటే అప్పుడు వైద్య పరీక్ష చేయించుకోవాలి.

ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్లలో ఫ్రెక్కల్స్‌ ఏర్పడతాయి. ఇవీ పుట్టుమచ్చల్లానే ఉంటాయి. కానీ కాదు. వీటిలో కొన్ని లేత రంగులో ఉంటే మరికొన్ని ముదురు రంగులో ఉంటాయి. ఎండ వేడికి ఇంకా ముదురు రంగులోకి వస్తుంటాయి. మీకు ఇవైనా కావొచ్చు. ముందు ఎండకు దూరంగా ఉండండి. సన్‌స్క్రీన్‌ కనీసం ఎస్‌పీఎఫ్‌30తోపాటు యూవీఏ, యూవీఎఫ్‌ ఉన్న వాటిని రాసుకోవాలి. అవసరమైతే గొడుగు, వస్త్రంతో కవర్‌ చేసుకోవాలి. వీటిని పాటించి చూడండి. చాలావరకూ తగ్గుతాయి. అప్పటికీ ఫలితం లేకపోతే చర్మనిపుణుల్ని కలవండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్