ఆంక్షలు.. నచ్చటం లేదు

చిన్నతనం నుంచీ ఎన్నో ఆంక్షల మధ్య పెరిగాను. పెళ్లైన తర్వాతా నా పరిస్థితిలో మార్పులేదు. ఇప్పుడు ఇంటర్‌ చదువుతోన్న మా అమ్మాయికీ అదే పరిస్థితి. క్రమశిక్షణ పేరుతో మావారు ఆంక్షలు పెడుతోంటే చాలా బాధగా ఉంది. ఏంచేయాలో అర్థంకావడం లేదు.

Published : 21 Aug 2022 01:04 IST

చిన్నతనం నుంచీ ఎన్నో ఆంక్షల మధ్య పెరిగాను. పెళ్లైన తర్వాతా నా పరిస్థితిలో మార్పులేదు. ఇప్పుడు ఇంటర్‌ చదువుతోన్న మా అమ్మాయికీ అదే పరిస్థితి. క్రమశిక్షణ పేరుతో మావారు ఆంక్షలు పెడుతోంటే చాలా బాధగా ఉంది. ఏంచేయాలో అర్థంకావడం లేదు.

- ఓ సోదరి, ఏలూరు

పిల్లల్ని కట్టడి చేయడమన్నది సాధారణం. సమాజ  కట్టుబాట్లకు లోబడి నడుచుకోకపోతే చుట్టుపక్కలవాళ్లు దూరం పెట్టేస్తారు. ఆ క్రమశిక్షణ పిల్లలకు ఒత్తిడిలా అనిపించినా అది శ్రేయస్సు కోసమే. మన పిల్లలకు ఏమీ కాదులెమ్మని మంచీచెడూ చెప్పక, నియమ నిబంధనలు పెట్టకపోతే చెడుమార్గం పట్టే ఆస్కారముంది. కుటుంబ విలువలను పాటించడంలో, మన సంస్కృతి ప్రకారం నడచుకోవడంలో అవి ఉపయోగపడతాయి. అయితే బలవంతంగా కాకుండా నచ్చచెబుతూ నిజాన్ని గ్రహించేలా చేస్తే వ్యతిరేకత ఉండదు. 

మీరు బాధపడినందున మీ అమ్మాయి కూడా బాధపడుతోంది అనుకుంటున్నారు. అది నిజం కాకపోవచ్చు. ఇప్పటి పిల్లలకు తమకేం కావాలో తెలుసు. ఆంక్షలు పెడితే ఎదురుచెప్పకున్నా ఆ విషయాన్ని పక్కన పెట్టి ముందుకు సాగగలరు. ప్రశ్నించగలరు. మీ అమ్మాయితో అనునయంగా మాట్లాడండి. నిజంగానే బాధపడుతుంటే.. తనమీద అపనమ్మకం కాదని, సమాజంలో దారుణాలు చూసిన ఆందోళనతోనే అని నచ్చచెప్పండి. ‘మనచుట్టూ ఎన్నో ఆకర్షణలుంటాయి. ప్రలోభపెట్టేవారుంటారు. వాటిని అధిగమించడానికి ఆంక్షలు అవసరం’ అని వివరించి తనంతట తాను బాధ్యతగా ఉండేలా చూడండి. అలాగే మీ భర్తకు అమ్మాయి వేదన చెందుతున్న విషయం తెలియజేసి నెమ్మదిగా చెప్పమనండి. ఇదంతా మీ భర్తతో నిష్టూరం లేకుండా చెప్పండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్