ఆ విషయం చెప్పాలా.. వద్దా!

నా స్నేహితురాలిది అన్నిట్లో తనే ముందు ఉండాలనే మనస్తత్వం. ఓటమిని అసలు తట్టుకోలేదు. రెండేళ్ల కిందట పెళ్లైంది. తన భర్త ఉన్నతోద్యోగి. ఈమధ్య రెండు, మూడుసార్లు ఆయన్ను వేరే అమ్మాయితో చనువుగా చూశాను. ఈ నిజం తనతో

Published : 29 Aug 2022 01:23 IST

ప్రశ్న: నా స్నేహితురాలిది అన్నిట్లో తనే ముందు ఉండాలనే మనస్తత్వం. ఓటమిని అసలు తట్టుకోలేదు. రెండేళ్ల కిందట పెళ్లైంది. తన భర్త ఉన్నతోద్యోగి. ఈమధ్య రెండు, మూడుసార్లు ఆయన్ను వేరే అమ్మాయితో చనువుగా చూశాను. ఈ నిజం తనతో చెబితే ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని భయం. ఏం చేయాలో తోచడంలేదు..

- ఓ సోదరి, విజయవాడ

మీ స్నేహితురాలు అన్నిట్లో తానే ముందుండాలి అనుకోవడాన్ని బట్టి వాస్తవంలో కాక ఊహల్లో జీవించే వ్యక్తిలా కనిపిస్తోంది. అదలా ఉంచితే ఆమెకి పెళ్లయ్యి కాపురం చేస్తోంది కనుక భర్త మనస్తత్వాన్ని అర్థం చేసుకోగలదు. వాళ్ల మధ్య అవగాహన ఉంటుంది. సర్దుబాట్లు జరుగుతాయి. అది మీకు తెలీదు. ఆమె భర్త మరో స్త్రీతో చనువుగా ఉన్నంతలో అది మీరనుకున్నట్లు కాకపోవచ్చు. ఈ రోజుల్లో సోషల్‌గా ఉండటం సాధారణ సంగతి. మీరు తప్పుగా అర్థం చేసుకుని, తొందరపడి చెప్పినట్లయితే రెండు అనర్థాలు జరుగుతాయి. మొదటిది ఆమె మనసు గాయపడుతుంది. అది నిజం కాకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు, రిలేషన్‌ చెడిపోవచ్చు. మీకు స్నేహితురాలనే ప్రేమ, సానుభూతి ఉండొచ్చు. కానీ అతను కేవలం చనువుగా ఉన్నాడేమో. ఒకవేళ ఏదైనా ఉన్నా అది వాళ్లు పరిష్కరించుకోవాల్సిన విషయం. ఆమే చెప్తే తప్ప మీరు ఊహించుకోవడం సరికాదు. ఇదసలు మీ పరిధిలోకి రాదు. వాళ్ల ఆంతరంగిక విషయాల్లో మీ జోక్యం తగదు. ఒకవేళ అది నిజమైనా మీరు చెప్పడం భావ్యం కాదు. ఏదైనా తేడా వస్తే ఆమె చూసుకోగలదు. మీరు చెబితే జటిల సమస్యలా మారుతుంది. ఈ ఆలోచనను ఇంతటితో వదిలేస్తే మీకూ, వాళ్లకీ కూడా మంచిది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్