అందరి ముందూ అవమానం!

పనిచేస్తున్న సంస్థలోనే వేరే విభాగంలో ఉద్యోగమొచ్చింది. బదిలీ వ్యవహారాలన్నీ హెచ్‌ఆర్‌ విభాగమే చూసుకుంటోంది. దీంతో మా బాస్‌కు ముందస్తు నోటీసు ఇచ్చే అవకాశం లేకపోయింది. తీరా రిలీవ్‌ చేయమంటూ

Published : 31 Aug 2022 00:32 IST

పనిచేస్తున్న సంస్థలోనే వేరే విభాగంలో ఉద్యోగమొచ్చింది. బదిలీ వ్యవహారాలన్నీ హెచ్‌ఆర్‌ విభాగమే చూసుకుంటోంది. దీంతో మా బాస్‌కు ముందస్తు నోటీసు ఇచ్చే అవకాశం లేకపోయింది. తీరా రిలీవ్‌ చేయమంటూ మా బాస్‌కు మెయిల్‌ పెడితే.. ఆయనేమో ‘ముందస్తు నోటీసు ఇవ్వలేదు, ప్రొఫెషనల్‌ విలువలే లేవు’ అని కోప్పడుతూ పెద్ద రిప్లై పంపారు. పైగా దాని కాపీ మా బృందం మొత్తానికీ పెట్టారు. వేరే విభాగంలోకి వెళ్లిపోయాక తిరిగి ఈ బృందంతో పని ఉండదు. కానీ అందరి ముందూ అవమానమేగా! పైగా పని చేసేది ఒకే భవనంలో.. ఎప్పుడైనా ఎదురుపడితే నాకెలా ఉంటుంది? హెచ్‌ఆర్‌ వాళ్లు చెప్పిందే చేశా. అయినా ఆయనలా స్పందించారు. నేనిప్పుడేం చేయాలి?

- నళిని, పుణె

మీ పరిస్థితి నేనర్థం చేసుకోగలను. కోపం, అవమానం సహజమే. అయితే తొందరబాటు మాత్రం పనికిరాదు. ఈ సమయంలో బాగా ఆలోచించాకే ఏదైనా చేయడం మంచిది. పని ప్రదేశంలో ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడకుండా ఉండటమే మేలు. పదే పదే జరుగుతున్నప్పుడే చర్యల గురించి ఆలోచించాలి. అప్పుడే ఆఫీసు వాతావరణం సజావుగా సాగుతుంది. మీ బాస్‌ కానీ, తోటివాళ్లు కానీ దీన్ని పదే పదే ఎత్తి చూపుతోంటే సమస్యను చర్చించండి. అదీ అవతలి వ్యక్తితో నేరుగా మాట్లాడాలి. పదాల ఎంపికలో మాత్రం జాగ్రత్త! సమస్యను చెప్పి, అది మీపై ఎలా ప్రభావం చూపుతోందో వివరించండి. ఈమెయిల్‌, ఫోన్‌ వంటివి పెద్దగా ప్రభావం చూపవు కూడా. పైగా రాత ద్వారా పంపిన వాటిని ప్రశ్నిస్తున్నట్లుగా అర్థం చేసుకునే వీలూ లేకపోలేదు. కాబట్టి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోండి. మీ లక్ష్యం ఏంటి? ఈ నెగెటివ్‌ ప్రభావం కెరియర్‌కి అడ్డంగా మారకూడదు అనేకదా! కాబట్టి మీ బాస్‌ను నిందించడం, తిరిగి అవమానించడం లాంటివి పెట్టుకోకండి. మనం అందరికీ నచ్చాలని లేదు, పని చేసేచోట అందరూ స్నేహితులే ఉండాలనీ లేదు. అసూయ, ద్వేషం, తెలియని కోపం, పోలికలు, పోటీ వంటివి సహజం. వాటన్నింటి మధ్యా సాగుతూనే మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం ప్రధానం. దీన్ని గమనించుకొని ముందుకెళ్లండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్