అసలు మాట్లాడనివ్వరే!

ఫైనాన్స్‌ విభాగంలో పనిచేస్తున్నా. ఇక్కడ పురుషాధిక్యత ఎక్కువ. 14 మందిలో ముగ్గురమే మహిళలం. వారిలో ఇద్దరు జూనియర్లు. నేనొక్కదాన్నే మిడిల్‌ స్థాయిలో ఉన్నా. ప్రతి నెలా బడ్జెట్‌, ఫైనాన్స్‌ విషయాల్లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కి ప్రెజెంటేషన్‌లు ఇస్తుంటాం. దానిలో బృందసభ్యులు,

Published : 07 Sep 2022 00:54 IST

ఫైనాన్స్‌ విభాగంలో పనిచేస్తున్నా. ఇక్కడ పురుషాధిక్యత ఎక్కువ. 14 మందిలో ముగ్గురమే మహిళలం. వారిలో ఇద్దరు జూనియర్లు. నేనొక్కదాన్నే మిడిల్‌ స్థాయిలో ఉన్నా. ప్రతి నెలా బడ్జెట్‌, ఫైనాన్స్‌ విషయాల్లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కి ప్రెజెంటేషన్‌లు ఇస్తుంటాం. దానిలో బృందసభ్యులు, బాస్‌ నాకసలు మాట్లాడే అవకాశమే ఇవ్వరు. వెనక శ్రమంతా నాది. ఇక్కడికొచ్చేసరికి క్రెడిట్‌ వాళ్లు తీసుకుంటుంటారు. నేనేదైనా సలహానిచ్చినా మధ్యలో ఆపడమో.. దాన్నే తిరిగి వివరించడమో చేస్తుంటారు. అలాగని నాకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేవని కాదు.. సబ్జెక్టు పరిజ్ఞానమూ ఎక్కువే! ఈ పరిస్థితి నాకేనా? ఎదుర్కొంటున్న వారు ఉన్నారా? 

- సుజిత, విజయవాడ

ది సహజంగా కనిపించే వివక్షే! ఇంగ్లిష్‌లో ‘మాన్స్‌ప్లెయినింగ్‌’గా చెబుతాం. చాలామంది మహిళలు ఏదో రూపంలో ఎదుర్కొన్నవారే. బయటా మామాటే నెగ్గాలనే మగవాళ్లని ఎంతమందిని చూసుంటాం? మరీ దారుణం ఏంటంటే ఆఫీసులో మగ సహోద్యోగులు తమతో పనిచేసే మహిళల్ని మాట్లాడన్విక పోవడం. పోనీ మాట్లాడినా, సలహానిచ్చినా తప్పన్న భావన కలిగిస్తుంటారు. పైగా వాళ్ల సలహాలూ, మాటలూ, పనే ఉత్తమమన్న అభిప్రాయంతో ఉంటారు. ఆ తీరు మనకూ చిరాకు తెప్పిస్తుంది. ఇంకొందరు పురుషులు మాకన్నీ తెలుసనుకుంటారు. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడేస్తుంటారు. విన్నవాళ్లకే తెలుస్తుంది.. ఆ విషయంపై వాళ్లకేమీ అవగాహన లేదని!
మరి దీన్ని ఎదుర్కొనేదెలాగంటారా? సమస్య ఎదురైనప్పుడే దానిపై పోరాడటం. చాలామంది మగవాళ్లకి తామిలా చేస్తున్నామన్నదీ తెలియదు. ఆడవాళ్లకి ఏమీ తెలియదనో, వాళ్లపై పెత్తనం మగవాళ్లదే అన్న వాతావరణంలో పెరిగుంటారు. అందుకే మాట్లాడుతుంటేనే మధ్యలో ఆపేస్తుంటారు. దీన్ని చెప్పాల్సిన బాధ్యత మనదే! ‘మీరు నన్ను మాన్స్‌ప్లెయినింగ్‌ చేస్తున్నారు’ అనండి. అదేంటో వాళ్లకీ తెలియదు కదా! అపుడ[ు వివరించండి. అప్పుడే వాళ్లకీ వాళ్ల ప్రవర్తనపై అవగాహనొస్తుంది. అందరూ అర్థం చేసుకుంటారనీ అనుకోవద్దు. కొనసాగించే వారుంటారు. భరించలేకపోతోంటే పైవాళ్ల దృష్టికి తీసుకెళ్లండి. వాళ్లే చూసుకుంటారు. మౌనంగా మాత్రం భరించొద్దు. సమానత్వం కావాలని కోరుకోవడంతో సరిపోదు. దాని దిశగా మనమూ అడుగులూ వేయాలి. అప్పుడే దాన్ని సాధించగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్