ఆరోగ్యం క్షీణించినా.. భర్త చూడట్లేదు!

నా స్నేహితురాలికి 46 ఏళ్లు. భర్త రైల్వే ఉద్యోగి. కొన్నాళ్ల కిందట భర్త ఉద్యోగం వదిలి గల్ఫ్‌కు వెళ్లాడు. తర్వాత వీళ్ల ఏకైక కుమార్తెకి పెళ్లయింది. తను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. స్నేహితురాలిని ఆమె భర్త తీసుకువెళ్లకుండా తన అమ్మానాన్నల దగ్గర ఉంచాడు. నెలకు కొంత మొత్తం పంపేవాడు. ఈమధ్య మానేశాడు. తన ఆరోగ్యం క్షీణించింది. తరచూ డయాలసిస్‌ అవసరం. ప్రభుత్వ సహకారానికి ...

Updated : 14 Sep 2022 13:26 IST

నా స్నేహితురాలికి 46 ఏళ్లు. భర్త రైల్వే ఉద్యోగి. కొన్నాళ్ల కిందట భర్త ఉద్యోగం వదిలి గల్ఫ్‌కు వెళ్లాడు. తర్వాత వీళ్ల ఏకైక కుమార్తెకి పెళ్లయింది. తను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. స్నేహితురాలిని ఆమె భర్త తీసుకువెళ్లకుండా తన అమ్మానాన్నల దగ్గర ఉంచాడు. నెలకు కొంత మొత్తం పంపేవాడు. ఈమధ్య మానేశాడు. తన ఆరోగ్యం క్షీణించింది. తరచూ డయాలసిస్‌ అవసరం. ప్రభుత్వ సహకారానికి ప్రయత్నిస్తే బీపీఎల్‌ ధ్రువీకరణ పత్రాలు లేవు. స్నేహితులూ, బంధువుల సహాయం సరిపోవడంలేదు. కూతురూ పట్టించుకోవడం లేదు. ఆమె తరఫున కేసు వేయొచ్చా? 

 - ఓ సోదరి

తప్పకుండా వేయొచ్చు. ఈ కేసు సెక్షన్‌ 3(ఖిజ్శు   గృహహింస చట్టం (ఆర్థిక హింస) కింద వస్తుంది. గృహహింస చట్టం ఛాప్టర్‌ ఖిఖిఖి, సెక్షన్‌ 4 ప్రకారం నియమితులైన రక్షణాధికారికి గృహహింస బాధితురాలి గురించి ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. సెక్షన్‌ 5 గృహహింస చట్టం ప్రకారం... బాధితురాలికి సాయం కోసం ముఖ్యంగా.. ఆర్థిక సాయం, రక్షణ సాయం, నష్టపరిహారం, పిల్లల సంరక్షణ, ఇంట్లో ఉండే హక్కు.. మొదలైనవి భర్త, పిల్లల నుంచి ఇప్పించడానికి కేసును కోర్టుకు పంపిస్తారు. సెక్షన్‌- 7 ప్రకారం బాధితురాలిని సంబంధిత వైద్య విభాగానికి పంపిస్తారు. ఉండటానికి ఇల్లు లేకపోతే షెల్టర్‌ హోమ్‌లో వసతి కల్పిస్తారు. మీ స్నేహితురాలి గురించి ముందుగా సంబంధిత రక్షణాధికారికి లేదా స్వచ్ఛంద సంస్థకు ఫిర్యాదు చేయండి. ఆమెకు భర్త, పిల్ల నుంచి సాయం ఇప్పించడానికి ప్రయత్నించండి. అలా వీలు కాకపోతే మహిళా, స్త్రీ సంక్షేమ విభాగానికి తెలియపరచండి. భర్త నుంచి నిర్దేశిత మొత్తం లేదా మెడికల్‌ మెయింటెనెన్స్‌ రాబట్టాలంటే ముందు అతని అడ్రెస్‌ సంపాదించండి. అతని పాస్‌పోర్ట్‌ నంబర్‌ తెలిస్తే దాని ద్వారా రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. వాళ్లు అతన్ని సులభంగా పట్టుకోగలరు. జాతీయ మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేస్తే విదేశాంగశాఖ ద్వారా అతని అడ్రెస్‌ సంపాదించి నోటీసు పంపుతారు. ఖర్చుకు భయపడి పట్టించుకోకుండా ఉంటే అతని దగ్గర నుంచి ఆ మొత్తం రాబట్టడం కష్టం అవుతుంది. అంత సమయం లేదు కాబట్టి.. ముందుగా కూతురి నుంచి సాయానికి ప్రయత్నించవచ్చు. తక్షణమే ప్రయత్నించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్