ఇంటిపేరు మార్చుకోకుంటే ఇబ్బందా?

నాకు పెళ్లై పదేళ్లవుతోంది. ఆధార్‌ కార్డులో ఇంటిపేరు పుట్టింటిది ఉంది. భవిష్యత్తులో నా పేరు మీద ఆస్తి కొన్నా, అబ్బాయికి ఆస్తి ఇవ్వాలన్నా దీనివల్ల ఏదైనా ఇబ్బందా?  ప్రభుత్వ రికార్డుల్లో నా పుట్టింటి పేరు స్థానంలో అత్తింటి వారి పేరు కచ్చితంగా మార్చుకోవాలా? 

Published : 20 Sep 2022 00:28 IST

నాకు పెళ్లై పదేళ్లవుతోంది. ఆధార్‌ కార్డులో ఇంటిపేరు పుట్టింటిది ఉంది. భవిష్యత్తులో నా పేరు మీద ఆస్తి కొన్నా, అబ్బాయికి ఆస్తి ఇవ్వాలన్నా దీనివల్ల ఏదైనా ఇబ్బందా?  ప్రభుత్వ రికార్డుల్లో నా పుట్టింటి పేరు స్థానంలో అత్తింటి వారి పేరు కచ్చితంగా మార్చుకోవాలా? 

- ఓ సోదరి

పుట్టింటి పేరు/ఇంటి పేరు మార్చుకోక పోవడంవల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఆస్తి కొన్నప్పుడూ ఇప్పుడు ఏ పేరు వాడుతున్నారో ఆ పేరు మీదున్నా నష్టమేమీ లేదు. మీ పిల్లలు మీకు వారసులుగా ధ్రువీకరించే పత్రాలు ముఖ్యం. అంటే మీరు, మీ భర్త కలిసి తీసుకున్న.. కుటుంబ సభ్యుల సర్టిఫికెట్‌/ లీగల్‌ హేర్‌ సర్టిఫికెట్‌.. లాంటివి పిల్లలు వారసత్వ ఆస్తులను పంచుకోవడానికి పనికొస్తాయి. ప్రస్తుతానికి మీ పేరు పుట్టింటి  పేరుమీదే కొనసాగుతోంది కాబట్టి దాన్ని అధికారిక రికార్డుల్లోనూ కొనసాగించండి. దానికే ఇబ్బందీ ఉండదు. ఒకవేళ భవిష్యత్తులో అధికారిక రికార్డుల్లో అంటే రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు.. మొదలైన వాటిలో ఇంటి పేరు మార్చుకోవాలనుకుంటే దానికో పద్ధతి ఉంది. అందుకు ముందుగా స్త్రీ, శిశు సంక్షేమశాఖలో సంబంధిత విభాగానికి వెళ్లి దరఖాస్తు తీసుకుని, దానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు కట్టి జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మార్క్స్‌ మెమో జతచేయాలి. దాంతో పాటు పేరు ఎందుకు మార్చుకోవాలని అనుకుంటున్నారో ఒక అఫిడవిట్‌ తయారుచేసి నోటరీ చేయించి, పత్రికల్లో ప్రచురించి, ఎలా పేరు మార్చుకుంటున్నారో దాన్ని జతచేసి గెజిట్‌ పబ్లికేషన్‌ కోసం దరఖాస్తు చేయాలి. అప్పుడు సంబంధిత విభాగం వారు దాన్ని ప్రచురించి మీకు కాపీ పంపుతారు. గెజిట్‌ ప్రచురణ అయిన రోజు నుంచి మీరు కొత్త పేరు వాడుకోవచ్చు. ఇంటిపేరే కాదు, పేరు మార్చుకోవాలన్నా ఇదే పద్ధతి. కానీ ఇంటిపేరు మార్చుకోవాలన్న నిబంధనైతే లేదు కాబట్టి మీకు ఎలా వీలైతే అలా చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్