వంకాయ పడటం లేదెందుకు?

నాకు 50 ఏళ్లు. వంకాయ తింటే ఒంటిమీద దద్దుర్లు వస్తున్నాయి. ఈ వయసులో గోంగూర, బెండకాయ.. లాంటివాటికీ దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిజమేనా?

Published : 22 Sep 2022 01:26 IST

నాకు 50 ఏళ్లు. వంకాయ తింటే ఒంటిమీద దద్దుర్లు వస్తున్నాయి. ఈ వయసులో గోంగూర, బెండకాయ.. లాంటివాటికీ దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిజమేనా?

- ఓ సోదరి

యసురీత్యా ఆహారం పడటంలేదని చెప్పడానికి మీది మరీ పెద్ద వయసైతే కాదు. కొందరిలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు అలర్జీ ఉంటుంది. ఇన్నాళ్లూ లేనిది  కొత్తగా ఎందుకంటే.. ఈమధ్య మీరు తీవ్రమైన బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు గురై ఎక్కువగా యాంటీ బయోటిక్స్‌ వాడితే జీర్ణవ్యవస్థలో మార్పులు వస్తాయి. కొత్త రకమైన బ్యాక్టీరియా చేరడం, అవి రక్తంలో వేగంగా కలవడంలాంటి మార్పులు వస్తాయి. అదే సమయంలో మేలు చేసే పాత బ్యాక్టీరియా పోయుండాలి. వీటి కారణంగా అలర్జీలు వస్తాయి. చర్మవైద్య నిపుణులు లేదంటే జీర్ణకోశ నిపుణుల్ని సంప్రదిస్తే వివిధ ఆహార పదార్థాలకు సంబంధించి మీ అలర్జీ స్థాయిని లెక్కిస్తారు. దాన్నిబట్టి కొద్ది పరిమాణంలో వాడొచ్చా, పూర్తిగా మానేయాలా.. ఏదో ఒకటి చెబుతారు. వయసు పెరిగినపుడు అలర్జీలూ, అజీర్ణం.. రావడం సహజం. కానీ అవి 70, 80ల్లో మాత్రమే కనిపిస్తాయి. అప్పుడు జీర్ణకోశంలో కొన్ని రకాల ఆమ్లాల ఉత్పత్తి తగ్గడమే అందుకు కారణం. అందరికీ ఒకే రకమైన ఆహారం విషయంలో అలర్జీలు ఉండవు. వ్యక్తినిబట్టి మారుతాయి. అలర్జీ తగ్గాలంటే సమీకృత ఆహారం తీసుకోవడం మేలు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఓట్స్‌, శనగలు, బెండ, జామ, అరటి, ఆకుకూరలు.. ఇవన్నీ తీసుకోవాలి. అప్పుడు మళ్లీ శరీరంలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందొచ్చు. అలా కొన్నాళ్లకు అలర్జీ ఉన్న పదార్థాల్ని కూడా పూర్తిగా మానేయకుండా తక్కువ మోతాదులో తీసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్