కూతురికీ.. కోడలికీ ఆస్తి ఇవ్వొచ్చా!

నాకు స్వార్జితమైన ఇల్లు, మరికొంత ఆస్తి ఉన్నాయి. నాకు ఇద్దరు పిల్లలు.. అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరూ మేజర్లే. అయితే నా స్వార్జితాన్ని అబ్బాయికి కాకుండా కూతురికీ, కోడలికీ సమానంగా ఇవ్వాలనుకుంటున్నా. ఇలా చేయడానికి చట్టపరంగా ఏమైనా ఇబ్బందా?

Published : 27 Sep 2022 00:46 IST

నాకు స్వార్జితమైన ఇల్లు, మరికొంత ఆస్తి ఉన్నాయి. నాకు ఇద్దరు పిల్లలు.. అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరూ మేజర్లే. అయితే నా స్వార్జితాన్ని అబ్బాయికి కాకుండా కూతురికీ, కోడలికీ సమానంగా ఇవ్వాలనుకుంటున్నా. ఇలా చేయడానికి చట్టపరంగా ఏమైనా ఇబ్బందా?

మీ స్వార్జితం అయితే మీకు ఇష్టం వచ్చిన వారికి ఇవ్వొచ్చు. హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం ఎవరైనా సొంతంగా సంపాదించింది కానీ, ఏదైనా మార్గం నుంచి వచ్చినది కానీ, భాగస్వామ్యం ద్వారా విభజించబడి మీ భాగంగా వచ్చింది కానీ స్వార్జితం అవుతుంది. పిత్రార్జితం కానిది, ఉమ్మడి కుటుంబానికి చెందని ఆస్తి స్వార్జితం అవుతుంది. దీనిని ఎవరికైనా ఇవ్వొచ్చు. అంటే పిల్లలకి వీలునామా ద్వారా తెలియపరచాలి. ఎవరికి ఇవ్వాలనేది వీలునామా ద్వారా రాసిపెడితే, దాని మీద ముఖ్యంగా ఇద్దరి సాక్షి సంతకాలు ఉండాలి. రిజిస్ట్రేషన్‌ చేయాల్సిన పనిలేదు. కానీ భవిష్యత్తులో మళ్లీ వివాదాలు రాకుండా ఉండాలంటే రిజిస్ట్రేషన్‌ చేయించడం మంచిది. కోర్టుకి వెళ్లే సమస్య వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్‌ అయిన డీడ్‌ అయితే రుజువు చేయడం సులభమవుతుంది. వీలునామా అనేది మీ తదనంతరం చెల్లుబాటులోకి వస్తుంది. కాబట్టి వెంటనే ఎవరికీ ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వీలునామా మార్చాలనుకున్నా మార్చుకోవచ్చు. దీనికి లిటిగేషన్‌ క్లాజ్‌ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు వీలునామా రాసిన తర్వాత రహస్యంగా ఉంచవచ్చు. దానికి మీరు భయపడాల్సిన పనిలేదు. మీ వీలునుబట్టి చేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్