నెలసరిలో సెలవు కావాలట!

ఎలక్ట్రానిక్స్‌ సేల్స్‌ విభాగానికి మేనేజర్‌ని. నా టీమ్‌లో నలుగురు అమ్మాయిలున్నారు. చాలా బాగా పనిచేస్తారు. ఒకమ్మాయి వచ్చి నెలసరి రోజుల్లో సరిగ్గా పని చేయలేకపోతున్నా అంటోంది. ప్రతినెలా రెండ్రోజులు సెలవివ్వండి, నా టార్గెట్స్‌ మిస్‌ అవ్వనీయనని హామీ ఇస్తోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. 

Published : 28 Sep 2022 01:04 IST

ఎలక్ట్రానిక్స్‌ సేల్స్‌ విభాగానికి మేనేజర్‌ని. నా టీమ్‌లో నలుగురు అమ్మాయిలున్నారు. చాలా బాగా పనిచేస్తారు. ఒకమ్మాయి వచ్చి నెలసరి రోజుల్లో సరిగ్గా పని చేయలేకపోతున్నా అంటోంది. ప్రతినెలా రెండ్రోజులు సెలవివ్వండి, నా టార్గెట్స్‌ మిస్‌ అవ్వనీయనని హామీ ఇస్తోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. 

- స్వప్నిక, దిల్లీ

నెలసరి రోజుల్లో ఉద్యోగినులకు సెలవు ఇవ్వడంపై చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. జీతంతోనా, జీతం లేకుండా సెలవా అన్నదీ చర్చనీయాంశమైంది. నెలసరి గురించి మాట్లాడటమే తప్పనే సమాజం మనది. అమ్మాయిలకీ ఇదే నేర్పిస్తుంటాం. దీంతో దానివల్ల కలిగే నొప్పి మగవాళ్లకి అర్థమవదు. సామాజిక మాధ్యమాలు, కొన్ని సంస్థల పుణ్యమా అని ఆ సమయంలో కలిగే అసౌకర్యం, నొప్పి వంటి వాటిపై అవగాహన మొదలైంది. దేశంలో కొన్ని సంస్థలు సమస్యను అర్థం చేసుకొని తమ ఉద్యోగినులకు జీతంతో కూడిన సెలవలిస్తున్నాయి. జపాన్‌, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాలు గతంలోనే మహిళా ఉద్యోగుల లీవ్‌ పాలసీలో మెన్‌స్ట్రువేషన్‌ లీవ్‌నూ చేర్చాయి. వాళ్ల బాటలోనే ఇప్పుడు బైజూస్‌, జొమాటో, కల్చర్‌ మేగజీన్‌ వంటి భారతీయ సంస్థలు నడుస్తున్నాయి. బిహార్‌ ప్రభుత్వమూ పిరియడ్‌ లీవ్స్‌ను అధికారికంగా ఇస్తోంది. ఇది మినహా దేశంలో మరే రాష్ట్రమూ ఈ సెలవును అమలు పరచడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగినులకు పిరియడ్‌ లీవ్స్‌ ఇవ్వాలన్న చర్చ పార్లమెంట్‌లోనూ జరిగింది. ఇవన్నీ ఈ విషయ ప్రాధాన్యాన్ని తెలియజెప్పేవే. ఒక మహిళగా తన పరిస్థితేంటో మీకూ పరిచయమే కదా! మీపైవాళ్లతో మాట్లాడండి. సెలవు వీలు కాదంటే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కుదురుతుందేమో చూడండి. ఆ అవకాశం లేకపోతే... తనకు ఇబ్బందిగా ఉన్నప్పుడు కొద్దిసేపు విశ్రాంతినివ్వడం, చిన్నచిన్న పనులు అప్పజెప్పడం లాంటివి చేయొచ్చు. ఆలోచించాలే కానీ ఏదో ఒకరకంగా సాయం చేయొచ్చు. అదెలా అనేది ఆలోచించి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్