మైగ్రేన్‌తో బాధా?

తలనొప్పి, జలుబు... కావడానికి చిన్న సమస్యలే కానీ తెగ ఇబ్బంది పెట్టేస్తాయి కదూ! ఇవి గనుక మాటిమాటికీ వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయడానికి లేదు. మరేదైనా తీవ్ర అనారోగ్యం కారణంగానో లేదా వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్లనో అయ్యుండొచ్చు. ఏదేమైనా వీటిని యోగాతో తరిమేయొచ్చు. గతంలో చెప్పిన భుజంగాసనానికి మల్లేనే సరళ మత్స్యాసనం కూడా జలుబును తగ్గిస్తుంది.

Published : 01 Oct 2022 00:27 IST

లనొప్పి, జలుబు... కావడానికి చిన్న సమస్యలే కానీ తెగ ఇబ్బంది పెట్టేస్తాయి కదూ! ఇవి గనుక మాటిమాటికీ వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయడానికి లేదు. మరేదైనా తీవ్ర అనారోగ్యం కారణంగానో లేదా వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్లనో అయ్యుండొచ్చు. ఏదేమైనా వీటిని యోగాతో తరిమేయొచ్చు. గతంలో చెప్పిన భుజంగాసనానికి మల్లేనే సరళ మత్స్యాసనం కూడా జలుబును తగ్గిస్తుంది. తలనొప్పినీ నివారిస్తుంది.

ఇలా చేయాలి...

మత్స్యాసనం అంటే చేపను తలపించేలా ఉంటుంది. వెల్లకిలా పడుకోవాలి. రెండు అరచేతులూ చెవుల పక్కన ఆనించి ఫొటోలో చూపినట్లుగా తలనీ, భుజాల్నీ నేల నుంచి కొంచెం పైకి లేపి తల పై భాగాన్ని మాత్రమే కింద ఆనించాలి. చేతులను తొడల మీద పెట్టుకోవాలి. అలా కాళ్ల మీద పెట్టడం కష్టమనిపిస్తే రెండు చేతులనూ కింద ఆనించి ఉంచవచ్చు. ఈ భంగిమలో ఎంతసేపు ఉండగలరో అంత సేపు ఉండి, చేతులను తీసి మళ్లీ భుజాలకూ చెవులకూ మధ్యన ఉంచాలి. మెల్లగా తలను యథాస్థితికి తీసుకురావాలి. ఇలా మూడుసార్లు చేయాలి.

ఇవీ లాభాలు...

సరళ మత్స్యాసనం తలనొప్పి, సైనస్‌లతో బాధపడుతున్న వారికి ఎంతో మంచిది. ముఖ్యంగా మైగ్రేన్‌ తలనొప్పిని తగ్గిస్తుంది. మెడనొప్పి ఉన్న వారికీ దీనివల్ల ఉపశమనం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్