ఏంటీ.. చిన్నపొక్కులు?

నాకు పదిహేనేళ్లు. నుదురు, ముక్కు మీద చిన్న పొక్కులు వస్తున్నాయి. ఏంటివి? పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి?

Published : 02 Oct 2022 00:12 IST

నాకు పదిహేనేళ్లు. నుదురు, ముక్కు మీద చిన్న పొక్కులు వస్తున్నాయి. ఏంటివి? పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

దీన్ని గ్రేడ్‌ వన్‌ యాక్నే అంటాం. ఈ వయసులో నూనెలు ఎక్కువగా విడుదలవ్వడం, బ్యాక్టీరియా, హార్మోన్లు.. ఇలా వీటికి చాలా కారణాలుంటాయి. బ్లాక్‌హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ చిన్నచిన్నగా ఏర్పడి.. ఇలా వస్తుంటాయి. టీనేజ్‌లో ఉన్నారు.. టెస్టోస్టిరాన్‌ విడుదల ప్రారంభమవడమూ కారణమే. ఒత్తిడి, కాలుష్యం, మాస్క్‌ వల్లా వస్తుంటాయి. మైల్డ్‌ యాక్నేనే కాబట్టి కంగారు వద్దు. పాల పదార్థాలు, బ్రెడ్‌ వంటి గ్లుటెన్‌ పదార్థాలు, చిప్స్‌, ఐస్‌క్రీమ్‌, సోడా, కూల్‌డ్రింక్‌లకు దూరంగా ఉండండి. రెటినాయిక్‌ యాసిడ్‌, 2.5% బెంజాల్‌ పెరాక్సైడ్‌ ఉన్న క్రీములను వాడండి. రెండూ కలిపి ఉన్నవీ దొరుకుతాయి. ఇది రాశాక మాయిశ్చరైజర్‌ వాడాలి. సాల్సిలిక్‌ యాసిడ్‌ ఉన్న ఫేస్‌వాష్‌లను వాడండి. తల నూనెలూ ఒక్కోసారి కారణమవుతాయి. నుదురుకు దగ్గరగా రాయకుండా చూసుకోండి. షాంపూలనూ గ్లిజరిన్‌, వాటర్‌ ఆధారితమైనవి వాడండి. మాయిశ్చరైజర్‌లో నూనెలు, కోకో, షియాబటర్‌ లేని, నాన్‌ కమొడొజెనిక్‌ లేబుల్‌ ఉన్నవి వాడండి. ముఖాన్ని బాగా రుద్దడం వంటివి చేయొద్దు. డెర్మటాలజిస్ట్‌ను ఓసారి కలిసి మీ చర్మానికి తగిన క్రీములను సూచించమనొచ్చు. అయితే వాటిని కొనసాగించడం ప్రధానం. అప్పుడే ఈ మొటిమలు పెద్దవవడం, మచ్చలు ఏర్పడటం వంటివి రాకుండానూ కాపాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్