మోకాళ్ల నొప్పులకు స్వస్తి చెబుదాం...

ఆహారం వల్ల కావచ్చు, పనిభారం, మానసిక ఒత్తిళ్ల వల్ల కావచ్చు.. మనలో చాలామందికి వృద్ధాప్యం రాకముందే కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. కాస్త దూరం కూడా నడవలేని, మెట్లు ఎక్కలేని పరిస్థితి ఎదురవుతోంది. దీనికి విరుగుడుగా గతంలో గరుడాసనం గురించి చెప్పుకొన్నాం. కీళ్ల ముద్రతోనూ మోకాళ్ల నొప్పులను నిరోధించవచ్చు. ప్రయత్నించి సత్వర ఫలితం పొందుదామా...

Published : 08 Oct 2022 00:40 IST

ఆహారం వల్ల కావచ్చు, పనిభారం, మానసిక ఒత్తిళ్ల వల్ల కావచ్చు.. మనలో చాలామందికి వృద్ధాప్యం రాకముందే కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. కాస్త దూరం కూడా నడవలేని, మెట్లు ఎక్కలేని పరిస్థితి ఎదురవుతోంది. దీనికి విరుగుడుగా గతంలో గరుడాసనం గురించి చెప్పుకొన్నాం. కీళ్ల ముద్రతోనూ మోకాళ్ల నొప్పులను నిరోధించవచ్చు. ప్రయత్నించి సత్వర ఫలితం పొందుదామా...

కింద కూర్చోగలిగిన వాళ్లు సుఖాసనంలో లేదా సౌఖ్యంగా ఉండేలా కుర్చీలో కూర్చోవచ్చు. వెన్నెముక నిటారుగా ఉండాలి. కుడిచేయి ఉంగరం వేలు, బొటనవేళ్లను వంచి చివర్లు కలిపి ఉంచాలి. మిగిలిన వేళ్లు తిన్నగా ఉండాలి. ఎడమ చేత్తో మధ్య, బొటన వేళ్లను మడిచి చివర్లను కలపాలి. చిటికెన వేలు, ఉంగరం వేలు, చూపుడు వేలు తిన్నగా ఉండాలి. రెండు మోకాళ్ల మీద పెట్టి కళ్లు మూసుకుని మెల్లగా శ్వాస తీసుకుని వదులుతుండాలి. ఈ ముద్రలో శ్వాసతో ప్రాణశక్తిని తీసుకుంటూ.. ఆ శక్తిని కీళ్లలో నొప్పి ఉన్న ఒక్కొక్క జాయింట్‌ మీద కేంద్రీకరిస్తున్నట్టుగా భావించాలి. ప్రతిసారీ ఒక జాయింట్‌ అయ్యాక ఇంకోటి చొప్పున నొప్పి ఉన్న దగ్గరకు మన శ్వాసను పంపుతున్నట్టుగా, శ్వాసను బయటకు వదులుతున్నప్పుడు నొప్పిని కూడా వదిలేస్తున్నట్టుగా భావించాలి. ఇలా ఐదు నిమిషాలు చేయాలి. నొప్పి ఎక్కువగా ఉన్నవాళ్లు రోజుకు నాలుగుసార్లు ఈ ముద్ర చేయాలి. కీళ్ల నొప్పులు తగ్గుతూ ఉంటే ముద్ర సమయాన్ని కూడా తగ్గించవచ్చు. మొదట్లో రోజుకు మూడుసార్లు, తర్వాత రెండుసార్లు, తర్వాత ఒకసారి చొప్పున చేస్తే సరిపోతుంది.

ఇవీ ప్రయోజనాలు

ఈ ముద్రతో కీళ్ల నొప్పులకు స్వస్తి చెప్పొచ్చు.

* ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి.

* శరీరం, మెదడు ఉత్తేజితమౌతాయి. 

* రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్