వైట్‌హెడ్స్‌ పోగొట్టేదెలా?

వయసు 35. ముక్కు మీద వైట్‌హెడ్స్‌ ఎక్కువగా వస్తున్నాయి. కొద్దిగా నొక్కినా తెల్లగా వస్తోంది. పోవడానికి ఏం చేయాలి?

Published : 09 Oct 2022 00:33 IST

వయసు 35. ముక్కు మీద వైట్‌హెడ్స్‌ ఎక్కువగా వస్తున్నాయి. కొద్దిగా నొక్కినా తెల్లగా వస్తోంది. పోవడానికి ఏం చేయాలి?

- ఓ సోదరి

ముక్కుమీద నూనె గ్రంథులు ఎక్కువ. చర్మరంధ్రాలూ పెద్దగా ఉంటాయి. వీటిల్లో నూనెలు, మృతకణాలు చేరినపుడు బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో బ్లాక్‌హెడ్స్‌, వైట్‌హెడ్స్‌ ఏర్పడుతుంటాయి. మాస్క్‌ పెట్టుకోవడం, ఆయిల్‌ ఆధారిత సౌందర్య ఉత్పత్తులు వాడటం వల్లా ముక్కుమీద నూనెలు ఎక్కువగా విడుదలయ్యి వీటికి దారితీస్తాయి. ఇవీ ఒకరకమైన యాక్నేనే. హార్మోనుల్లో మార్పులు, గర్భం, ఆందోళన, ఒత్తిడి కూడా వీటికి కారణమవుతాయి. నెలసరి ముందు, గర్భనిరోధక మాత్రలు వాడటం వల్లా వస్తుంటాయి. ఆయిల్‌ మేకప్‌, మాయిశ్చరైజర్లకు బదులుగా నాన్‌కమొడిజెనిక్‌ లేదా మినరల్‌ ఉత్పత్తులు, టోనర్‌ వాడండి. తలస్నానం కూడా వారానికి మూడుసార్లు చేయాలి. ముఖానికి మైల్డ్‌ క్లెన్సర్‌ వాడండి. స్క్రబ్‌లను వారానికోసారి తప్ప వాడొద్దు. పార్లర్‌లో తీయించడం లాంటివి చేయొద్దు. బెంజైల్‌ పెరాక్సైడ్‌, సాల్సిలిక్‌ యాసిడ్‌, రెటినాయిక్‌ యాసిడ్‌ క్రీమ్‌లను వాడాలి. రోజుకు రెండుసార్లు మైల్డ్‌ ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఫోన్‌, పిల్లో కవర్‌ తరచూ శుభ్రం చేసుకుంటుండాలి. వీటివల్లా బ్యాక్టీరియా ముఖం మీదకే చేరే అవకాశాలెక్కువ. ఉత్పత్తులు ఎక్స్‌పైరీ డేట్‌ చూసుకోవాలి. మేకప్‌ సామగ్రి ఎవరితోనూ పంచుకోవద్దు. వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలి. వీటన్నింటితో సమస్య అదుపులోకి వస్తుంది. తగ్గకపోతే అప్పుడు వైద్యుల సలహాతో యాంటీ బయాటిక్‌ మాత్రలు వాడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్