రాజీనామా చేశాక కొనసాగమంటున్నారు!

ఐదేళ్లుగా మా బాస్‌ నన్ను పదోన్నతికి సిఫారసు చేయట్లేదు. ఏదో ఒక కారణం చెప్పి ఆపుతూ వచ్చారు. అయితే నాకు మంచి ఉద్యోగావకాశం రావడంతో గత నెల రాజీనామా ఇచ్చా.

Published : 12 Oct 2022 00:33 IST

ఐదేళ్లుగా మా బాస్‌ నన్ను పదోన్నతికి సిఫారసు చేయట్లేదు. ఏదో ఒక కారణం చెప్పి ఆపుతూ వచ్చారు. అయితే నాకు మంచి ఉద్యోగావకాశం రావడంతో గత నెల రాజీనామా ఇచ్చా. నోటీస్‌ పిరియడ్‌లో ఉన్న నాతో బాస్‌.. ఇక్కడే కొనసాగు. కావాలంటే ప్రమోషన్‌ ఇస్తానంటున్నారు. నేనేం చేయాలి?

   - ఆనంది

నోటీస్‌ పిరియడ్‌లో ఉండి, ఇలాంటి అవకాశమొస్తే తీసుకోవడం మంచిది కాదనేది నిపుణుల సూచన. హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ సర్వే ప్రకారం 40% సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, హెచ్‌ఆర్‌ లీడర్లు ఇదే చెప్పారు. ఇంకా మీ విధేయత, అంకితభావాన్ని అనుమానించడమే కాదు భవిష్యత్‌ పదోన్నతులకూ ఇబ్బంది ఏర్పడొచ్చట. కొన్నిసార్లు సంస్థే ఉద్యోగంలోంచీ తొలగించే ముప్పుఉంది. మొహమాటం కొద్దీ ఒప్పుకొని, తర్వాత మారినా సంస్థతో సత్సంబంధాలు తెగే ప్రమాదమూ లేకపోలేదు. ముందు మీ బాస్‌ని కలవండి. తిరిగి కొనసాగమనడానికి కారణాలేంటో కనుక్కోండి. ఇది సంస్థలో మీ విలువ తెలుసుకునే మార్గం. భవిష్యత్‌ ఇంటర్వ్యూల్లోనూ సాయపడుతుంది. అలాగని కొనసాగాలనేం లేదు. లాభనష్టాలను బేరీజు వేసుకోండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. మానేయాలనుకుంటే మీ స్థానంలో కొత్తవ్యక్తిని సిద్ధం చేయడంలోనూ, మానేశాకా సందేహాలను తీర్చడంలోనూ వీలైనంత సాయం చేస్తానని చెప్పండి. మిమ్మల్ని ఉండమంటున్నారంటేనే సంస్థకు మీరు ఆస్తితో సమానం. కాబట్టి ఆ నెట్‌వర్క్‌ను కొనసాగించడం భవిష్యత్‌లో మీకే లాభదాయకం. కాబట్టి స్నేహపూర్వకంగా సంస్థను వీడండి. మొత్తంగా ఆఫర్‌ను అంగీకరించొద్దనే నా సలహా. సంస్థలో ఉన్నన్నాళ్లూ మీ ఉన్నతిని పట్టించుకోని వాళ్లు తర్వాతా పట్టించుకుంటారని చెప్పలేం. కాబట్టి, మృదువుగానే నో చెప్పేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్