అవీ నెరుస్తున్నాయ్‌!

వయసు 30. అప్పుడే తల నెరుస్తోంది. దారుణమేంటంటే కనుబొమలు, పెదవిపై వెంట్రుకలూ తెల్లబడుతున్నాయి. ఇవెందుకు అప్పుడే తెల్లబడుతున్నాయి. ఆపే మార్గాలను చెప్పండి.

Published : 16 Oct 2022 00:34 IST

వయసు 30. అప్పుడే తల నెరుస్తోంది. దారుణమేంటంటే కనుబొమలు, పెదవిపై వెంట్రుకలూ తెల్లబడుతున్నాయి. ఇవెందుకు అప్పుడే తెల్లబడుతున్నాయి. ఆపే మార్గాలను చెప్పండి.

- ఓ సోదరి

చర్మంలో మెలనిన్‌ ఉత్పత్తి తగ్గినప్పుడు తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. ఇది వృద్ధాప్యచిహ్నం. కానీ కొంతమందిలో చాలాత్వరగా కనిపిస్తోంది. మెలనిన్‌ పిగ్మెంట్‌లో ఉండే రసాయనాల్లో అసమతుల్యత ఒక కారణం. వయసు పెరిగేకొద్దీ మనం తీసుకునే పోషకాలు కురుల కుదుళ్లవరకూ వెళ్లవు. హార్మోనుల్లో అసమతుల్యత, అనారోగ్యకర జీవన శైలి, కాలుష్యం, కొన్ని మందులూ కొన్ని సార్లు తెల్లజుట్టుకు కారణమవుతాయి. సోడా, తీపిపదార్థాలు, జంక్‌ఫుడ్‌, ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకునే వారిలోనూ మెలనిన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. కొన్నిసార్లు వంశపారంపర్యం కారణమవొచ్చు. విటమిన్‌ బి12 తగ్గడం, థైరాయిడ్‌ సమస్య, ఒత్తిడి, ఎండలో ఎక్కువగా తిరగడం, రసాయనాలున్న, సింథటిక్‌ షాంపూలు వాడటం, తరచూ వాటిని మారుస్తుండటం కూడా తెల్లవెంట్రుకలకు దారితీస్తాయి. మెలనిన్‌ స్థాయి తగ్గేకొద్దీ కనుబొమలు, పెదవిపై వెంట్రుకలపైనా ప్రభావం పడుతుంది. ఇది మామూలుగానే మగవారితో పోలిస్తే మహిళల్లో ఎక్కువ.

పరిష్కారాలు: విటమిన్‌ ఎ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పసుపు రంగు పండ్లు, గోధుమ, పెరుగు, టొమాటో, అరటి, చిరుధాన్యాలు, గుడ్డు, చేప, సీఫుడ్‌, సోయాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. మల్టీవిటమిన్‌ ట్యాబ్లెట్లనూ తీసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కరివేపాకు లేదా ఉసిరి, మెంతు పొడులను వేసి వేడి చేసి రాసుకోండి. పాంటోథినిక్‌ యాసిడ్‌నీ రాసుకోవచ్చు. బాగా కనిపిస్తోంటే బొటానికల్‌ హెయిర్‌ డై, హెన్నా పెట్టొచ్చు. కనుబొమలు, పెదవిపై వాటిని లేజర్‌, ఎలక్ట్రాలిసిస్‌ ద్వారా తొలగించొచ్చు. ఏదేమైనా ఆరోగ్యకరమైన ఆహారం, రోజూ కొద్దిసేపు వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారానే ఈ నెరుపును ఆలస్యం చేయగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్