రెండో పెళ్లి చేసుకుంటే బాబుని వాళ్లకి ఇవ్వాలా?

తల్లి, తండ్రి పిల్లలకు సహజ సంరక్షకులు. తండ్రి తరువాత తల్లి సహజ సంరక్షకురాలు అవుతుంది. మీరు వేరే పెళ్లి చేసుకుంటే బిడ్డను మీ అత్తగారు వాళ్లకు ఇవ్వాల్సిన పనిలేదు. మీ బిడ్డతో సహా మిమ్మల్ని చూసుకోవడానికి అంగీకరించే వాళ్లని చూసి చేసుకోవచ్చు. మీ అత్తగారు వాళ్లకు విజిటింగ్‌ హక్కులు... అంటే బాబుని అప్పుడప్పుడూ చూసుకునే హక్కు ఉంటుంది.

Updated : 18 Oct 2022 04:10 IST

నాకు 27 ఏళ్లు. బాబుకి ఆరేళ్లు. మావారు రెండేళ్ల కిందట పోయారు. అత్తారింట్లో ఉంటున్నాను. పని మనిషిలా చూస్తున్నారు తప్ప నాకక్కడ విలువ లేదు. అక్కణ్నుంచి వచ్చేస్తే వేరే పెళ్లి చేసుకుందువుగానీ అంటున్నారు అమ్మానాన్న. నా ఆందోళన బాబు గురించే. నేను వేరే పెళ్లి చేసుకుంటే వాడి కస్టడీని అత్తమామలకు ఇవ్వాలా? వాడు నాతో ఉండే వీలుందా? నేను బయటకు వస్తే నాకు గానీ, బాబుకి గానీ మావారి ఆస్తి వస్తుందా?  

- ఓ సోదరి

ల్లి, తండ్రి పిల్లలకు సహజ సంరక్షకులు. తండ్రి తరువాత తల్లి సహజ సంరక్షకురాలు అవుతుంది. మీరు వేరే పెళ్లి చేసుకుంటే బిడ్డను మీ అత్తగారు వాళ్లకు ఇవ్వాల్సిన పనిలేదు. మీ బిడ్డతో సహా మిమ్మల్ని చూసుకోవడానికి అంగీకరించే వాళ్లని చూసి చేసుకోవచ్చు. మీ అత్తగారు వాళ్లకు విజిటింగ్‌ హక్కులు... అంటే బాబుని అప్పుడప్పుడూ చూసుకునే హక్కు ఉంటుంది. మీ మరో పెళ్లికి వారి అనుమతి కూడా అవసరం లేదు. పిల్లవాడిని వాళ్లు ప్రేమగా చూస్తుంటే వాళ్లకి చూపించడంలో నష్టంలేదు. ఆస్తి విషయానికి వస్తే అది ఎవరిది, ఎవరు సంపాదించింది, ఎవరి పేరు మీద ఉంది అనే వాటి మీద ఆస్తి వస్తుందా రాదా అన్నది ఆధారపడి ఉంటుంది. మీ మామ గారి స్వార్జితం అయ్యి, ఆయన వీలునామా రాయకుండా చనిపోతే మీ బాబుకు తప్పక వస్తుంది. మీ వారి పేరిట ఉన్న ఆస్తి అయినా మీ అబ్బాయికి తప్పక వస్తుంది. ఒకవేళ వారు మీకు ఎలాంటి ఆధారం చూపించడం లేదంటే మీ మామ గారికి పిత్రార్జితపు ఆస్తి ఉంటే మీ అబ్బాయి తరఫున భాగస్వామ్య దావా వేసి వాటా అడగొచ్చు. మీ భర్త పేరు మీద ఆస్తిని మీ పేరు మీదకీ, మీ అబ్బాయి పేరు మీదకీ మార్చుకునే హక్కు ఉంటుంది. దానికి వారు అడ్డుపడితే గనుక ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారో వారి నుంచి భరణం పొందొచ్చు. మిమ్మల్ని సరిగ్గా చూడడం లేదని గృహహింస చట్టం కింద ఫిర్యాదు కూడా చేయొచ్చు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్