సెగగడ్డలు.. వాటితో మచ్చలు!

నాకు కాలంతో సంబంధం లేకుండా సెగగడ్డలు వస్తున్నాయి. ముఖం, చేతులు, కాళ్లు.. అవి వచ్చిన చోట నల్లగా మచ్చలు. ఇవి రాకుండా ఏం చేయాలి? మచ్చలు పోగొట్టే మార్గముందా?

Published : 23 Oct 2022 00:10 IST

నాకు కాలంతో సంబంధం లేకుండా సెగగడ్డలు వస్తున్నాయి. ముఖం, చేతులు, కాళ్లు.. అవి వచ్చిన చోట నల్లగా మచ్చలు. ఇవి రాకుండా ఏం చేయాలి? మచ్చలు పోగొట్టే మార్గముందా?

- ఓ సోదరి

ఫరెంకెల్స్‌.. అక్కడక్కడా గడ్డల్లా వచ్చి, చీముతో కూడి ఉంటాయి. కార్బంకుల్‌ అంటే ముణ్నాలుగు కలిసి గుంపుగా ఏర్పడతాయి. ఎర్రగా, వంకాయ రంగులో ఉండి, చీము, నొప్పి ఉంటాయి. ఇన్ఫెక్షన్‌ లోతుగా వస్తుంది. తగ్గాక నల్లగా లేదా గుంటగా ఏర్పడతాయి. మొహం, మెడ, చేతులు, కాళ్లమీద వస్తాయి. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షనే కారణం. చర్మంపై చిన్న దెబ్బలు, ఏవైనా కుట్టడం వల్ల బ్యాక్టీరియా లోపలికి చేరి వస్తుంటాయి. ఇదివరకే ఉన్నవారి నుంచీ సోకుతుంది. యాక్నే, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిలో ఇవి ఎక్కువ. బయటికి వెళ్లినప్పుడల్లా చేతులు శుభ్రం చేసుకోవడం, దెబ్బ తగిలిన వెంటనే ప్లాస్టర్‌ వేయడం, సబ్బు, టవల్‌ వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకుండా ఉండటం ద్వారా రాకుండా చూసుకోవచ్చు. అలాగే బయటికెళ్లొచ్చాక స్నానం తప్పక చేయండి. చెమట, ఎక్కువ వెంట్రుకలు, రాపిడి ఎక్కువ జరిగే ప్రదేశాల్లో ఈ సెగగడ్డలు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడూ బ్యాండేజ్‌ వేయడం, ఆల్ఫాహైడ్రాక్సీ యాసిడ్‌, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్‌ క్రీములు రాస్తే చాలావరకూ మచ్చలుండవు. విటమిన్‌ సి 250 మి.గ్రా. ఉన్నవి తీసుకోండి. మచ్చలు తగ్గడానికి సమయం పడుతుంది. ఏదైనా నూనె, మాయిశ్చరైజర్‌, విటమిన్‌ ఇ క్రీములు రాస్తుండండి. జింక్‌, గుమ్మడి గింజలు, ఫ్యాట్‌ తక్కువ ఉండే పాల ఉత్పత్తులు, తాజా కూరగాయలు, పండ్లు రోజువారీ ఆహారంలో తీసుకోండి. బాగా మొండిగా కనిపిస్తోంటే కెమికల్‌ పీల్స్‌ ప్రయత్నించవచ్చు. మచ్చలకు తేనె, కలబంద, ఉల్లిరసం వంటివీ రాయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్