రెండు సీరమ్‌లు.. రాయొచ్చా?

మా చెల్లికి 27 ఏళ్లు. హైలురోనిక్‌ యాసిడ్‌, రెటినాల్‌ సీరమ్‌లు ఉదయం, రాత్రి ఒక్కోటి రాస్తోంది. అప్పుడే ఇవెందుకు వాడటమంటే వినట్లేదు. అసలు ఇలా ఒకేసారి వేర్వేరువి రాయొచ్చా?

Published : 30 Oct 2022 00:34 IST

మా చెల్లికి 27 ఏళ్లు. హైలురోనిక్‌ యాసిడ్‌, రెటినాల్‌ సీరమ్‌లు ఉదయం, రాత్రి ఒక్కోటి రాస్తోంది. అప్పుడే ఇవెందుకు వాడటమంటే వినట్లేదు. అసలు ఇలా ఒకేసారి వేర్వేరువి రాయొచ్చా?

- ఓ సోదరి

తను చేస్తోన్నది మంచిదే. 20ల్లోకి అడుగుపెట్టగానే చర్మసంరక్షణ ప్రారంభించాలి. చర్మతీరుకు తగిన స్కిన్‌ కేర్‌ రొటీన్‌ అలవాటు చేసుకోవాలి. మైల్డ్‌ క్లెన్సర్‌తో రెండు పూటలా ముఖాన్ని శుభ్రపరచుకోవడం, టోనర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ వంటివి దానిలో భాగంగా ఉండాలి. వారానికోసారి ఓట్‌ మీల్‌ స్క్రబ్‌, ఆరెంజ్‌ పీల్స్‌ లాంటివి చేయాలి. ఇవే కాక యాక్నే వంటి చర్మ సమస్యలుంటే, వాటికి సంబంధించినవీ జోడించాలి. హైలురోనిక్‌ యాసిడ్‌ చర్మాన్ని హైడ్రేట్‌ చేయడమే కాదు.. మృదువుగానూ మారుస్తుంది. చిన్న చిన్న గాయాల్నీ మాన్చడంతోపాటు వృద్ధాప్య ఛాయల్నీ దూరంగా ఉంచుతుంది. దీన్ని ఉదయం రాసుకుంటే మంచిది. రెటినాల్‌ ముడతలు, గీతలు, యాక్నే, వాటి మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. దీన్నేమో రాత్రిపూటే రాయాలి. కొందరిలో చర్మం ఎర్రబడటం లాంటివి కనిపిస్తాయి. అప్పుడు దాని పరిమాణాన్ని తగ్గించి రాస్తే సరిపోతుంది. ఇది రాశాక మాయిశ్చరైజర్‌నూ తప్పక వాడాలి. దాంతోపాటు తాజా కూరగాయలు, పండ్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్నీ, కనీసం 6 గ్లాసుల నీటిని తీసుకోవాలి. అప్పుడు చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. మీ చెల్లెలు ఏది ఏ పూట రాస్తోందో చెక్‌ చేసుకోమనండి సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్