అతనికి మరో పెళ్లి చేస్తారట!

నా స్నేహితురాలు ఏడాది క్రితం గుళ్లో ప్రేమ వివాహం చేసుకుంది. ఫొటోలు, ఆధారాలూ ఉన్నాయి. కాకపోతే ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ ఏమీ చేయించలేదు.

Published : 08 Nov 2022 00:11 IST

నా స్నేహితురాలు ఏడాది క్రితం గుళ్లో ప్రేమ వివాహం చేసుకుంది. ఫొటోలు, ఆధారాలూ ఉన్నాయి. కాకపోతే ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ ఏమీ చేయించలేదు. సమస్య ఏంటంటే... ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు అతనికి వేరే పెళ్లి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లిని రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుందా? వారిద్దరూ భార్యాభర్తలని చెప్పడానికి ఇతర ఆధారాలు, ధ్రువ పత్రాలు ఏమైనా కావాలా?

- ఓ సోదరి

మీ స్నేహితురాలు సంప్రదాయబద్ధంగా చేసుకొనుంటే గుళ్లో పెళ్లి అయినా చెల్లుతుంది. హిందూ వివాహ చట్టం సెక్షన్‌ 7 ప్రకారం తంతులన్నీ పాటిస్తే ఆ పెళ్లి చెల్లుతుంది. దండలు, ఉంగరాలు మార్చుకుని పెళ్లి ఫొటోలు ఉన్నంత మాత్రాన చెల్లదు. తాళి కట్టడం, సప్తపది జరగాలి. అలాగే వరుడికి 21, వధువుకి 18 ఏళ్లు నిండి ఉండాలి. అన్నాచెల్లెళ్ల సంబంధం ఉండకూడదు. ఇద్దరికీ ఆమోదయోగ్యం అవ్వాలి. పెళ్లి చేసుకున్నాక కలిసి జీవించిన ఆధారాలున్నాయా? వాటితో అతనికి రెండో పెళ్లి జరగకుండా అడ్డుకోవచ్చు. ఇప్పుడూ పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ నింపితే సరిపోతుంది. అయితే దీనికి మీరు చెప్పిన ఆధారాలతోపాటు అడ్రస్‌ ప్రూఫ్‌, విద్యాభ్యాస ధ్రువపత్రాలు, పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు ముగ్గురి సంతకాలు జతచేయాలి. సర్టిఫికెట్లలో పేర్లు, దరఖాస్తులో వాటితో సరిపోవాలి. వాళ్లుంటున్న ఏరియా లేదా పెళ్లి చేసుకున్న ప్రదేశంలోని రిజిస్టర్‌ ఆఫీసుల్లో ఏదో ఒక దానిలో పెళ్లి నమోదు చేసుకోవచ్చు. ముందు వీళ్లిద్దరి పెళ్లి విషయం ఇరువైపులా పెద్దలకు తెలియజేయమనండి. వాళ్లు ఒప్పుకోకపోతే పోలీసుల సాయం తీసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి. అతను ఇంట్లో చెప్పుంటే వాళ్లు రెండోపెళ్లి ప్రయత్నం చేసేవారు కాదేమో! వీలైనంత తొందరగా పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చట్టబద్ధంగా భార్యాభర్తలనిపించుకునే హక్కుని కాపాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్