ఏ కెరియర్‌ ఎంచుకోను?

నాకు 21. ఇంట్లో నేనే పెద్దదాన్ని. యాక్టింగ్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, జర్నలిజం.. ఇంకా బోలెడు కెరియర్లలో దేన్ని ఎంచుకోవాలో అర్థమవడం లేదు. ఆరు నెలల క్రితం మాస్‌ కమ్యూనికేషన్స్‌లో పీజీ అయింది. జీవితాంతం ప్రేమించే దానిలో చేరాలన్నది నా కల. గ్రాఫిక్‌ డిజైన్‌తో మొదలుపెట్టి చాలా రంగాల్లో ప్రయత్నిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా.

Published : 16 Nov 2022 00:27 IST

నాకు 21. ఇంట్లో నేనే పెద్దదాన్ని. యాక్టింగ్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, జర్నలిజం.. ఇంకా బోలెడు కెరియర్లలో దేన్ని ఎంచుకోవాలో అర్థమవడం లేదు. ఆరు నెలల క్రితం మాస్‌ కమ్యూనికేషన్స్‌లో పీజీ అయింది. జీవితాంతం ప్రేమించే దానిలో చేరాలన్నది నా కల. గ్రాఫిక్‌ డిజైన్‌తో మొదలుపెట్టి చాలా రంగాల్లో ప్రయత్నిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. ప్రతిదీ చేసి చూడాలనుకునే నాలాంటి వాళ్లకు మీరేం సలహా ఇస్తారు. 

 - ప్రతిభ

చాలా వాటిలో ఆసక్తి ఉంది. మంచిదే! కాకపోతే ఒక్కదాన్ని ఎంచుకోవడమే సమస్య. పోనీ ఓ పని చెయ్యండి. మీకు ప్రావీణ్యం ఉన్నవాటిలో వేటిని హాబీగా ఎంచుకోవచ్చో, వేటిని కెరియర్‌గా మలచుకోవడానికి ఇష్టపడతారో గమనించండి. పని చేసేచోట ఎక్కువ నైపుణ్యాలున్నవారిని బలమైన అభ్యర్థిగా పరిగణిస్తారు. అయితే ఏ రంగంలో రాణించాలన్న స్పష్టత మాత్రం తప్పనిసరి. ఒకేసారి బోలెడు అంశాలను ప్రయత్నించడం ఎవరికీ సాధ్యం కాదు. పోనీ ప్రయత్నిద్దామనుకున్నా సరిగా చేయలేరు కూడా. కాబట్టి, మీకు దేనిలో పట్టుందో కనుక్కొని, దానిలో ఆస్వాదించేలా చేయగల ఉద్యోగాలు ఏమున్నాయో వెతకండి. కళాశాల నుంచి బయటకొచ్చి ఆరునెలలే! దీనిలోనే తప్పక కొనసాగాలన్న పరిస్థితిలో మీరింకా లేరు. కాబట్టి, కంగారొద్దు. మీకు ఆనందాన్ని ఇవ్వగలిగేదేదో వెతకడంలో నిమగ్నమైపోండి. అన్నట్టూ గ్రాఫిక్‌ డిజైన్‌ ప్రయత్నించాలని ఉందన్నారు కదా! పోనీ చేసేయండి. ఎలాగూ ఒక్కదానిలో స్థిరపడే మనస్తత్వం మీది కాదు. నటన, రచనలు ఇంకా ఇతర ఆసక్తులను హాబీలుగా మలచుకుంటే సరి. తర్వాత గ్రాఫిక్‌ డిజైన్‌ అంతగా మెప్పించలేదనుకోండి... ఎంచుకున్న ఇతర రంగాలెలాగూ ఉన్నాయి. వ్యాపకంగా కొనసాగిస్తున్నారు కాబట్టి, వాటి అనుభవమూ ఎంచుకునే క్రమంలో స్పష్టతనిస్తుంది. ఇంకేం.. ప్రయత్నించేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్