బరువు తగ్గాలంటే... చపాతీలనే తినాలా?

నా వయసు 35. బరువు మాత్రం 78 కిలోలు. బరువు తగ్గాలంటే... కచ్చితంగా రాత్రుళ్లు చపాతీలే తినాలా? నాకు చిన్నప్పటి నుంచీ అన్నమే అలవాటు.

Updated : 17 Nov 2022 09:34 IST

నా వయసు 35. బరువు మాత్రం 78 కిలోలు. బరువు తగ్గాలంటే... కచ్చితంగా రాత్రుళ్లు చపాతీలే తినాలా? నాకు చిన్నప్పటి నుంచీ అన్నమే అలవాటు. ఇంకేమీ రుచించవు. పాలూ, పాల ఉత్పత్తులు అసలే తీసుకోను. దాంతో క్యాల్షియం, డి విటమిన్ల లోపంతో బాధ పడుతున్నాను. వీటిని అధిగమించి, బరువు అదుపులో ఉంచుకోవడానికి పరిష్కారం చెప్పరూ?

- సంధ్య, హైదరాబాద్‌

ఎంత బరువుండాలి అనేది ఆ వ్యక్తి బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బరువు¸ఎత్తు (మీటర్లలో)×ఎత్తు) పై ఆధార పడి ఉంటుంది. దాని ప్రకారం 30 కన్నా ఎక్కువ, 23 కంటే తక్కువ ఉండకూడదు. అలా ఉంటే కొలెస్ట్రాల్‌, రక్తపోటు, గుండె సమస్యల ముప్పు ఎక్కువ. బరువు తగ్గాలంటే.. అన్నం, తినాలా చపాతీ తినాలా అంటే... ఏదైనా మితంగా మాత్రమే తినాలని చెబుతాను. ఎందుకంటే, తీసుకునే ఆహార పరిమాణం మీదే మన బరువు ఆధారపడి ఉంటుంది. అలానే.... నూనె, ఉప్పు, తీపి పదార్థాలను కచ్చితంగా తగ్గించుకోవాలి. ఒక మనిషికి రోజూ తీసుకునే ఆహారంలో నూనె నాలుగు టీస్పూన్లు(20 ఎం.ఎల్‌) మించ కూడదు. చక్కెర, బెల్లం, తేనె... ఇలా ఏదైనా తీపిని రెండు చెంచాల కంటే ఎక్కువ తీసుకోకూడదు. విషయానికి వస్తే పచ్చళ్లు, సాస్‌లూ, కెచప్‌లూ, నిల్వ పదార్థాలన్నింటిలోనూ ఉప్పు కాస్త ఎక్కువే ఉంటుంది. అందుకే వాటిని అతిగా తినడం మానుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులను తీసుకోకపోతే క్యాల్షియం లోపిస్తుంది. దీనివల్ల ముఖ్యంగా మహిళల్లో ఎముకలు గుల్లబారే ప్రమాదం ఉంటుంది. ఆకు కూరలూ, సోయా... వంటివి ప్రత్యామ్నాయంగా తీసుకుందామనుకున్నా వాటిలో పాల నుంచి అందే మొత్తం కంటే తక్కువే క్యాల్షియం దొరుకుతుంది. అందుకే, ఫ్యాట్‌ శాతం తక్కువగా ఉండే పాలను ఎంచుకోండి. పాలు తాగలేకపోతే పెరుగూ, మజ్జిగ వంటివీ తీసుకోవచ్చు. ఆహారం నుంచి డి విటమిన్‌ అందేది తక్కువే. అందుకే సూర్యరశ్మి కనీసం ఓ గంట పాటు నేరుగా శరీరానికి తగిలేలా చూసుకోండి. ఇవన్నీ పాటించినప్పుడే బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్