త్రెడింగ్‌, వ్యాక్సింగ్‌ కాకుండా..

పెదవిపై సన్నగా వెంట్రుకలు కనిపిస్తున్నాయి. స్నేహితులేమో తీయించుకోమని సలహా ఇస్తున్నారు.

Published : 20 Nov 2022 00:57 IST

పెదవిపై సన్నగా వెంట్రుకలు కనిపిస్తున్నాయి. స్నేహితులేమో తీయించుకోమని సలహా ఇస్తున్నారు. త్రెడింగ్‌, వ్యాక్సింగ్‌ మంచివేనా? తగ్గించుకునే ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా?

- ఓ సోదరి

 

త్రెడింగ్‌, వ్యాక్సింగ్‌ తాత్కాలికంగా వెంట్రుకలను తొలగించే పద్ధతులు. వీటివల్ల ఒక్కోసారి చర్మం దెబ్బతినే అవకాశాలూ లేకపోలేదు. పెరిగే వేగాన్ని బట్టి, నెలకు ఒకట్నుంచి రెండుసార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి, మంట, ఎర్రబడటం వంటివి సాధారణం. శాశ్వతంగా తీయించుకోవాలంటే లేజర్‌ ఉత్తమ ఎంపిక. చాలావరకూ సమస్య తీరుతుంది. లేజర్‌ హెయిర్‌ ఫాలికల్స్‌ని నిర్జీవం చేస్తుంది. చర్మానికి సమస్యేమీ ఉండదు. ఇది చేయించుకోవడానికి 4-6 వారాల ముందు నుంచి త్రెడింగ్‌, వ్యాక్సింగ్‌ లాంటి వాటి జోలికెళ్ల కూడదు. లేజర్‌తో నొప్పి ఉండదు.. నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. 7-8 సిట్టింగ్స్‌ చేయించుకోవాలి. కాకపోతే కాస్త ఖర్చు. ఎలక్ట్రాలసిస్‌లో అయితే వంద శాతం వెంట్రుకలుండవు. కరెంట్‌ను హెయిర్‌ ఫాలికల్స్‌ ద్వారా పంపి, వాటిని నిర్జీవం అయ్యేలా చేస్తారు. దీనిలో కాస్త నొప్పి ఉంటుంది. ఎక్కువ సమయం తీసుకుంటుంది కూడా. మొదట లేజర్‌, ఆపై ఎలక్ట్రాలసిస్‌ చేయించుకుంటే ఖర్చు, నొప్పి తగ్గుతాయి. హెయిర్‌ రిమూవల్‌ క్రీమ్‌లను మాత్రం వాడొద్దు. ఇవి చర్మాన్ని నల్లగా మార్చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్