ఎండ తగిలితే.. సమస్య పెరుగుతోంది!

ముక్కు పక్క నుంచి బుగ్గలపై చిన్న చిన్న దద్దుర్లతో ఎర్రగా మారిపోతోంది. ఎండ తగిలితే సమస్య మరింత ఎక్కువవుతోంది. పరిష్కారమేంటి?

Updated : 27 Nov 2022 00:28 IST

ముక్కు పక్క నుంచి బుగ్గలపై చిన్న చిన్న దద్దుర్లతో ఎర్రగా మారిపోతోంది. ఎండ తగిలితే సమస్య మరింత ఎక్కువవుతోంది. పరిష్కారమేంటి?

- ఓ సోదరి


దీన్ని రొసేషియా, ఫ్లష్‌ అండ్‌ బ్లష్‌గా చెబుతాం. ప్రారంభంలో నవ్వినా, ఏడ్చినా, ఎండలోకి వెళ్లినా బుగ్గలు ఎర్రబడతాయి. రానురానూ బుగ్గల మీద ఎర్రదనం అలాగే ఉండిపోతుంది. ముక్కు, నుదురు, గడ్డం.. ఇలా ఇతర భాగాలకూ వ్యాపించే అవకాశముంది. కొన్నిసార్లు దద్దుర్లు, చిన్న మొటిమల్లా కనిపిస్తాయి. 30-50 వయసు వారిలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలావరకూ వంశపారంపర్యం కూడా కారణమవుతుంది. కొందరిలో ముక్కు చివర లావుగా, ఎర్రగా మారుతుంది. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా చెప్పలేం. చర్మరంధ్రాలు పెద్దగా అవుతాయి. అక్కడ చర్మం కూడా మందంగా తయారవుతుంది.

క్లెండమైసిన్‌, మెటర్నిడిజాల్‌, సెల్ఫాసిటమాయిడ్‌ వంటి టాపికల్‌, టెట్రాసైక్లిన్‌, మినోసైక్లిన్స్‌ వంటి ఓరల్‌ యాంటీ బయాటిక్స్‌ తీసుకోవాలి. ఎజిలాక్‌ యాసిడ్‌, రెటినాల్‌ వంటి క్రీములూ సాయపడతాయి. వేడి ఆహారం, కెఫిన్‌, కారం ఉండేవాటికి, ఎక్కువ చలి, వేడి వాతావరణాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళన, ఎక్కువ చక్కెర, కొవ్వు ఉన్న పదార్థాలు సమస్యని పెంచే ప్రమాదముంది. రోజుకు రెండుసార్లు గాఢత తక్కువున్న ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని తరచూ తాకొద్దు. దద్దుర్లను ఒత్తడం లాంటివి చేయొద్దు. బ్లాట్‌ పేపర్‌తో నెమ్మదిగా తుడవడం, ఐస్‌తో అద్దడం లాంటివి చేయాలి. యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను నీటిలో కలిపి దానిలో ముంచిన దూదితో ముఖమంతా రాసి, ఆరాక కడిగేయాలి. దాల్చిన చెక్కపొడికి తేనె కలిపి, ముఖానికి రాసి, పావుగంటయ్యాక కడిగేయాలి. వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్