వంట చేస్తోంటే కాళ్లు నొప్పి పుడుతున్నాయి...

నా వయసు 53. బరువు 80 కిలోలు. వంటకోసం రెండు గంటలైనా నిలబడి ఉండాల్సి వస్తోంది. దాంతో కాళ్ల నొప్పులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. నాకు బీపీ కూడా ఉంది. దీన్ని అదుపులో ఉంచుకుంటూ నొప్పులు తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి.

Updated : 01 Dec 2022 05:50 IST

నా వయసు 53. బరువు 80 కిలోలు. వంటకోసం రెండు గంటలైనా నిలబడి ఉండాల్సి వస్తోంది. దాంతో కాళ్ల నొప్పులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. నాకు బీపీ కూడా ఉంది. దీన్ని అదుపులో ఉంచుకుంటూ నొప్పులు తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి.

- సుబ్బలక్ష్మి, హైదరాబాద్‌

* అధిక రక్తపోటు, కాళ్ల నొప్పులతో బాధపడుతున్న మీరు ముందు బరువుని అదుపులో ఉంచుకోవాలి. మీ ఎత్తూ, బరువు ఆధారంగా బాడీ మాస్‌ ఇండెక్స్‌ 25 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. కండరాల బలాన్ని పెంచుకోవాలి. ఇవి ఆహారంతోనే సాధ్యం కావు. వ్యాయామం చేయాలి. వ్యాయామ శిక్షకుల మార్గదర్శకత్వంలో కసరత్తులు చేయండి. బరువు నియంత్రించుకో లేకపోతే... వయసు పెరిగే కొద్దీ బీపీ అదుపు కష్టమవుతుంది. అధిక రక్తపోటు ఉన్నప్పుడు కొవ్వు పదార్థాలూ, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా... ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, ప్యాకేజ్డ్‌ ఐటెమ్స్‌... అంటే చిప్స్‌, అప్పడాలు, నిల్వ పదార్థాలూ, పచ్చళ్లు వంటివి. ఎక్కువ పొటాషియం ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లూ, కూరగాయల వాడకం పెంచాలి. కూరల్లో నూనె తగ్గించాలి. రోజుకు నాలుగు స్పూన్ల కంటే ఎక్కువ వద్దు.  రోజు మొత్తానికి అరచెంచా కంటే తక్కువ మాత్రమే ఉప్పు వాడాలి. శాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు హెచ్చుగా ఉండే పాలు, నెయ్యి, క్రీం, రెడ్‌మీట్‌ వంటివి తగ్గించినా, పూర్తిగా మానేసినా మంచిదే. కాళ్ల నొప్పుల విషయానికి వస్తే చాలామంది మహిళల్లో ఉండే క్యాల్షియం లోపమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే గుమ్మడి, అవిసె, నువ్వులూ వంటి గింజలనూ, ఆకుకూరలూ, పెరుగూ వంటి వాటినీ రోజూ తప్పక తీసుకోవాలి. అప్పుడే కాళ్ల నొప్పులతో పాటూ బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్