వ్యాక్స్‌ కాకుండా.. ఇంకేమైనా!

స్లీవ్‌లెస్‌ దుస్తులు వేసుకోవడం ఇష్టం. అందుకే బాహుమూలల్లో వ్యాక్స్‌ ద్వారా వెంట్రుకలు తీయిస్తుంటా. కానీ అక్కడ నల్లగా మారుతోంది.

Updated : 04 Dec 2022 00:22 IST

స్లీవ్‌లెస్‌ దుస్తులు వేసుకోవడం ఇష్టం. అందుకే బాహుమూలల్లో వ్యాక్స్‌ ద్వారా వెంట్రుకలు తీయిస్తుంటా. కానీ అక్కడ నల్లగా మారుతోంది. కొన్నిసార్లు చర్మమూ ఊడొస్తోంది. హెయిర్‌ రిమూవల్‌ క్రీములు పడట్లేదు. దీనికి ప్రత్యామ్నాయాలు లేవా? నలుపుదనం అలా ఉండిపోతుందా?

- ఓ సోదరి

హెయిర్‌ రిమూవల్‌ క్రీములు చర్మాన్ని నల్లగా మారుస్తాయి. వెంట్రుకలు తీయడం, లాగేయడం కూడా మెలనోసైట్స్‌ పెరిగేలా చేస్తాయి. అందుకే అక్కడి చర్మం మందంగా, నల్లగా మారుతుంది. షేవ్‌ చేస్తోంటే షేవింగ్‌ క్రీమ్‌ వంటివి వాడాలి. తీసేశాక మాయిశ్చరైజర్‌ తప్పక రాయాలి. అప్పుడీ సమస్య చాలావరకూ తగ్గుతుంది. ఒక్కోసారి హార్మోనుల్లో తేడాలూ, అధిక బరువు, మధుమేహం, పీసీఓఎస్‌ కూడా నలుపుదనానికి కారణమవొచ్చు. వ్యాక్స్‌, హెయిర్‌ రిమూవల్‌ క్రీములు చర్మంపై దద్దుర్లకూ కారణమై అక్కడి చర్మం మందంగా, నల్లగా మారడానికి కారణమవుతాయి. కాబట్టి, శాశ్వత పరిష్కారానికి లేజర్‌ లేదా ఎలక్ట్రాలసిస్‌ ప్రక్రియలను ఎంచుకోండి. 6-8 సిట్టింగ్స్‌తో వెంట్రుకలను చాలావరకూ తగ్గించుకోవచ్చు. తర్వాత పగలు కోజిక్‌ యాసిడ్‌, ఆల్ఫా హైడ్రాక్సీ, బీటా హైడ్రాక్సీ, రాత్రి రెటినాయిక్‌ యాసిడ్‌ క్రీములను వాడితే నలుపు తగ్గుతుంది. సూపర్‌ఫీషియల్‌, మీడియం, గ్లైకాలిక్‌ యాసిడ్‌ పీల్స్‌ చేయించుకుంటే దెబ్బతిన్న చర్మం పోయి.. సహజ రంగులోకి మారుతుంది. సహజంగా ప్రయత్నించాలనుకుంటే.. ముందు ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంపై దృష్టిపెట్టాలి. 3 టేబుల్‌ స్పూన్ల పాలు, టేబుల్‌ స్పూను శనగపిండి, కొన్ని చుక్కల నిమ్మరసం బాగా కలిపి రాసి.. 15 నిమిషాలయ్యాక కడిగేయాలి. లేదా టేబుల్‌ స్పూను చొప్పున తేనె, నిమ్మరసం, అర చెంచా బాదం నూనె కలిపి రాసి, ఆరాక కడిగేయాలి. పెరుగు, నారింజ గుజ్జు కలిపి రాసినా ఫలితం ఉంటుంది. వీటిల్లో వీలైన పద్ధతిని వారానికి మూడుసార్లు ప్రయత్నిస్తే సమస్య దూరమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్