అతడికి భార్యే మెయింటెనెన్స్‌ ఇవ్వాలట!

మా వారు సివిల్‌ ఇంజినీర్‌. మా పెళ్లై 12 ఏళ్లు. మాకో బాబు. వాడు కాస్త పెద్దయ్యాక ఉద్యోగంలో చేరా.

Updated : 06 Dec 2022 05:39 IST

మా వారు సివిల్‌ ఇంజినీర్‌. మా పెళ్లై 12 ఏళ్లు. మాకో బాబు. వాడు కాస్త పెద్దయ్యాక ఉద్యోగంలో చేరా. ఆయన నా జీతం, మా పుట్టింటి వాళ్లిచ్చే డబ్బుల మీద ఆధారపడుతూ ఉద్యోగం మానేశాడు. బంగారాన్నీ, ఆస్తుల్నీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. మారతాడని చూసి, ఫలితం లేక పిల్లాడితో పుట్టింటికి వచ్చేశా. ఉద్యోగం చేయడట. నేనే తనకి మెయింటెనెన్స్‌ ఇవ్వాలట. చట్టపరంగా నేనేం చేయొచ్చు?

- ఓ సోదరి

మీ సమస్య గృహహింస నిరోధక చట్టం - 2005 కిందికి వస్తుంది. సెక్షన్‌ 3 ప్రకారం డొమెస్టిక్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఎవరు, ఎవరిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, ఆర్థికంగా... వేధిస్తే గృహహింస కిందే లెక్క. దాని ప్రకారం... ఆస్తినీ, లేదా డబ్బుల్నీ తెమ్మని బలవంతం చేయడం, భయపెట్టడం వంటివి నేరాలే. డబ్బిమ్మని ఒత్తిడి చేయడం, కుటుంబ అవసరాలకు తగ్గ ఆర్థిక వనరులు సమకూర్చక పోవడం, ఇంటి అద్దె కట్టక పోవడం, మెయింటెనెన్స్‌ ఇవ్వకపోవడం వంటివన్నీ ఇందులోకే వస్తాయి. ఇంట్లో వస్తువులూ, ఆస్తులూ (స్థిర, చర ఆస్తులు, షేర్లూ, భూములూ) బలవంతంగా అమ్మడం, తాకట్టు పెట్టడం, పిల్లల స్థిర చరాస్తులు (ఉమ్మడి వైనా, విడిగా ఉన్నవైనా) తరలించడం, అమ్మడం, వాటిని అనుభవించాల్సిన వ్యక్తిని అనుభవించనివ్వకుండా అడ్డుపడటం వంటివీ గృహహింసగానే పరిగణిస్తాయి కోర్టులు. ‘తనని తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న భార్య/ భర్తని మాత్రమే పోషించాల’ని చెబుతోంది సెక్షన్‌ 125 సీఆర్‌పీసీ. కాబట్టి మీరు భయపడొద్దు. ఉద్యోగం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయని భార్య/భర్తకి భరణం ఇమ్మని కోర్టు చెప్పదు. అతని మీద గృహహింస చట్టం కింద ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేయండి. కౌన్సెలింగ్‌ ఇస్తారు. మారకపోతే కేసును కోర్టుకి పంపిస్తారు. అతనితో ఉండాలని మీకుంటే విడాకుల కేసు వేయొద్దు. మారతాడేమో చూడండి. గృహహింస చట్టంలో విడాకుల ప్రసక్తిలేదు కాబట్టి అక్కడ అతని స్పందనకు అనుగుణంగా తదుపరి ఆలోచించవచ్చు. ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్