క్యాండియాసిస్‌.. అంటే?

నాకు క్యాండియాసిస్‌ ఉందంటున్నారు.. ఏమిటిది? నిర్ధారణ చేసుకోవడానికి చేయించుకోవాల్సిన పరీక్షలేంటి?

Updated : 11 Dec 2022 04:37 IST

నాకు క్యాండియాసిస్‌ ఉందంటున్నారు.. ఏమిటిది? నిర్ధారణ చేసుకోవడానికి చేయించుకోవాల్సిన పరీక్షలేంటి?

- ఓ సోదరి

క్యాండియాసిస్‌ ఆల్‌బికాన్స్‌ అనే ఫంగస్‌ దీనికి కారణం. సాధారణంగా ఈ ఫంగస్‌ మన చర్మంమీద చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. శరీరంలో రోగ నిరోధకత తగ్గినా, సమస్య ఎదురైనా ఇది పెరిగి ఇన్ఫెక్షన్‌లా మారుతుంది. సాధారణంగా పాదాలు, నోట్లో, వెజైనా, గోళ్లు, పిల్లలో డైపర్‌ ర్యాష్‌లానూ వస్తుంది. చర్మం ఒరుసుకుపోవడం, చర్మం మడతల్లో, కాలు, చేతివేళ్ల మధ్యలోనూ కనిపిస్తుంది. చెమటలు ఎక్కువ, శరీరాన్ని సరిగా శుభ్రం చేసుకోకపోవడం, బిగుతుగా ఉన్న దుస్తులు ధరించడం, పీరియడ్‌లో తరచూ ప్యాడ్స్‌ మార్చుకోని వారిలో, హైపోథైరాయిడిజం, నీటిలో ఎక్కువగా పనిచేసేవారిలోనూ కనిపిస్తుంది. మామూలు ర్యాషెస్‌లానే వస్తాయి. ఎరుపు, వంకాయ రంగులో, చర్మం రాలుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. నొప్పి కూడా ఉంటుంది. స్కిన్‌ కల్చర్‌, స్కిన్‌ శాంప్లింగ్‌, నెయిల్‌ క్లిప్పింగ్స్‌ లాంటివి చేయించుకోండి.. అవునో కాదో తెలిసిపోతుంది. కీటోకొనెజాల్‌, క్లాట్‌రెమొజాల్‌, మీకోజొనాల్‌, ఆక్సికొనజాల్‌ క్రీములతో తగ్గిపోతుంది. ఇవి ట్యాబ్లెట్లు, క్రీముల రూపంలో దొరుకుతాయి. నోట్లో అయితే లిక్విడ్‌ మౌత్‌వాష్‌లనీ ఇస్తారు. పాదాలకు అయితే స్ప్రేలనీ, పౌడర్‌లనీ సూచిస్తాం. సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఒక్కోసారి యాంటీ ఫంగల్‌ ఐవీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాలేయ సమస్యలున్నవారు నిపుణుల సలహా తీసుకున్నాకే వాడాలి. పిల్లల్లో అయితే సర్వసాధారణం. ఎక్కువగా డైపర్‌ ర్యాష్‌లా కనిపిస్తుంది. స్నానం చేశాక, శరీరాన్ని పూర్తిగా తడిపోయేలా చూసుకోవాలి. లావుగా ఉన్నవాళ్లు మడతల్లో నీరు చేరకుండా చూసుకోవాలి. ఓపెన్‌ టో ఫుట్‌వేర్‌ వేసుకోవడం, పాదాలపైనా శ్రద్ధ వహించడం, రోజూ శుభ్రమైన సాక్సులను వేసుకోవడం వంటివి చేయడం ద్వారా దీన్ని దూరంగా ఉంచొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్