కొడుకు ఆస్తికి నేను హక్కుదారును కాదా?

నేనూ నా భర్త వయోవృద్ధులం. ఒక్కగానొక్క కొడుకు రెండేళ్ల క్రితం చనిపోయాడు. తన పేరు మీద ఒక ఇల్లు ఉంది. మరొకటి నా పేరునా, మా అబ్బాయి పేరునా ఉమ్మడిగా ఉంది. తను పోయాక కోడలు మాకు తెలియకుండా రెండు ఇళ్లనూ తన పేరిట మ్యుటేషన్‌ చేయించుకుంది. ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌లో ఇంటిపన్ను కడదామని చూస్తే ఈ విషయం తెలిసింది.

Updated : 13 Dec 2022 04:02 IST

నేనూ నా భర్త వయో వృద్ధులం. ఒక్కగానొక్క కొడుకు రెండేళ్ల క్రితం చనిపోయాడు. తన పేరు మీద ఒక ఇల్లు ఉంది. మరొకటి నా పేరునా, మా అబ్బాయి పేరునా ఉమ్మడిగా ఉంది. తను పోయాక కోడలు మాకు తెలియకుండా రెండు ఇళ్లనూ తన పేరిట మ్యుటేషన్‌ చేయించుకుంది. ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌లో ఇంటిపన్ను కడదామని చూస్తే ఈ విషయం తెలిసింది. మున్సిపాలిటీలో విచారిస్తే... అంతా నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. అదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద లిఖిత పూర్వకంగా ఇవ్వమంటే... మాకోడలి సమ్మతి లేకుండా ఇవ్వం అంటున్నారు. తనేమో మాట్లాడే అవకాశమూ ఇవ్వడం లేదు. మాకు న్యాయం జరిగే అవకాశం ఉందా?

- ఓ సోదరి

మీ కోడలు ఉమ్మడి ఆస్తిని మీకు తెలియకుండా, మ్యుటేషన్‌ చేయించుకోవడం సరికాదు. హిందూ వారసత్వ చట్టం సెక్షన్‌ 8 ప్రకారం... హిందూ వ్యక్తి విల్లు రాయకుండా చనిపోతే... అతని ఆస్తి క్లాస్‌(1) వారసులకు చెందుతుంది. వారు లేకపోతే... క్లాస్‌(2) వారసులకు అది సంక్రమిస్తుంది. క్లాస్‌(1) వారసులుగా పిల్లలు, భార్య, తల్లి వస్తారు. వారసత్వ సర్టిఫికెట్‌ లేకుండా అలా తన పేరు మీదకు ఆస్తిని మ్యుటేషన్‌ ఎలా చేయించుకుందో తెలియడం లేదు. కచ్చితంగా ఏదో మోసం జరిగింది. మీకు తెలియకుండా మ్యుటేషన్‌ చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. అందులోనూ ఉమ్మడి ఆస్తిని మార్చడానికి అస్సలు వీలు లేదు. మున్సిపాలిటీ వారు చేసిన మోసాన్ని తెలియజేస్తూ హైకోర్టులో కేసు వేయండి. సీనియర్‌ సీనియర్‌ సిటిజన్‌ ట్రైబ్యునల్‌లో కూడా ఫిర్యాదు చేయండి. తప్పకుండా న్యాయం జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్