మళ్లీ మళ్లీ వస్తున్నాయ్‌!

వయసు 20. ముఖమంతా సన్న మొటిమలు. చాలా క్రీములు వాడా. లాభం లేదు. మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి. ఏం చేయను?

Updated : 18 Dec 2022 05:34 IST

వయసు 20. ముఖమంతా సన్న మొటిమలు. చాలా క్రీములు వాడా. లాభం లేదు. మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి. ఏం చేయను?

- ఓ సోదరి

యాక్నే త్వరగా తగ్గదు. చర్మంలో విడుదలయ్యే నూనెలు, మృతకణాలు చర్మరంధ్రాలను మూసేయడం వల్ల మొటిమలు వస్తుంటాయి. టెస్టోస్టిరాన్‌ స్థాయిలు పెరగడం, పి-యాక్నే పరిధి పెరగడం, పీసీఓఎస్‌ ఉన్నా ఇవి రావడం సహజమే! కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, తరచూ హెల్మెట్‌ పెట్టుకోవడం, మేకప్‌ సరిగా శుభ్రం చేసుకోకపోవడం కూడా యాక్నేకి కారణాలే. చిప్స్‌, గ్లుటెన్‌ ఎక్కువగా ఉన్నవి, పాలపదార్థాలు, సోడా వంటివి బాగా తీసుకుంటున్నారేమో చూసుకోండి. ఇవి సమస్యను పెంచుతాయి. తక్కువ మొత్తంలో ఉంటే బెంజైల్‌ పెరాక్సైడ్‌, క్లెండమైసిన్‌, సాల్సిలిక్‌ యాసిడ్‌ ఉన్న టాపికల్‌ క్రీములు రాస్తే సరిపోతుంది. మధ్యస్థంగా అంటే చీముతో కూడి ఉంటే ఈ క్రీములతోపాటు ఎజిత్రోమైసిన్‌, డాక్సిసైక్లిన్‌, మినోసైక్లిన్‌ లాంటి ఓరల్‌ బయాటిక్స్‌ కూడా తీసుకోవాలి. విపరీతంగా.. పెద్దగా, నొప్పితో, ఎర్రబడి ఉంటే క్రీములతోపాటు ఓరల్‌ రెటినాయిడ్స్‌ తీసుకోవాలి. వీటితోపాటు కెమికల్‌ పీల్స్‌ చేయించుకుంటే ఫలితం ఉంటుంది. ఏది వాడినా వైద్యుల సలహా తప్పనిసరి. అలాగే తగ్గాయి కదాని.. చికిత్సను ఆపడం, అశ్రద్ధ చేయడం తగదు. సూచించిన సమయం వరకూ కొనసాగించాలి. అప్పుడే వీటిని ఆపగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్