ఆ ఆస్తిలో సమానహక్కు ఉందా?

నాకు 56 ఏళ్లు. మా తాతగారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మా అమ్మ పెద్దకూతురు. తాతగారు తన పిల్లల వివాహ సమయంలో ఎవరి వాటా వారికిచ్చేశారు.

Updated : 20 Dec 2022 03:31 IST

నాకు 56 ఏళ్లు. మా తాతగారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మా అమ్మ పెద్దకూతురు. తాతగారు తన పిల్లల వివాహ సమయంలో ఎవరి వాటా వారికిచ్చేశారు. ఆయన చనిపోయేనాటికి ఎవరికీ రాయని 4 ఎకరాలుంది. దాన్ని మా మేనమామలు, వాళ్ల వారసులు సాగుచేస్తున్నారు. ఆస్తిలో అందరికీ సమాన హక్కని ఆయన రెండో కూతురు 20ఏళ్ల క్రితం పార్టిషన్‌ దావా వేసింది. అది కోర్టులో ఉండగానే మరణించింది. ఆవిడ తన వాటాకి నన్ను వారసురాలిగా.. దావా కొనసాగించాలని వీలునామా ద్వారా కోరింది. చట్టం ప్రకారం ఆడపిల్లకి ఇలాంటి ఆస్తిపై సమాన హక్కు ఉంటుందా?

- ఓ సోదరి

మీ తాతగారు వీలునామా రాయకుండా చనిపోయారు కాబట్టి, ఆయన తదనంతరం ఆస్తిలో తన పిల్లలందరికీ సమాన వాటా వస్తుంది. ఆ పొలం సాగు చేసుకుంటున్న మీ మామయ్య వారసులు వారిపేరు మీద ఎలాంటి పట్టాలూ చేయించుకోపోతే మీ అందరికీ సమాన భాగాలు రావాలని వేసిన పార్టిషన్‌ దావా నిలబడుతుంది. ఒకవేళ పట్టాలు చేయించుకొని ఉంటే క్యాన్సిలేషన్‌ ఆఫ్‌ పట్టా కోసం మరో దావా వేయాలి. మీ పిన్ని వేసిన దావాని ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసి ఆవిడ తరఫున మీరు కొనసాగించొచ్చు. దీంతోపాటు ఆవిడకి ఎవరైనా వారసులుంటే వారినీ వాదులుగా చేర్చాలి. పిత్రార్జితంలో ఆడపిల్లలకూ సమాన భాగాలివ్వాలని 1985లోనే సక్సెషన్‌ యాక్ట్‌ ఏపీలో సవరణ వచ్చింది. 2005లో అప్పుడున్న కండిషన్‌ అంటే 1985 తర్వాత పెళ్లయిన వారికే వర్తిస్తుందన్న నిబంధనకు సడలింపు ఇచ్చారు. 2005 తర్వాత భాగాలు పంచుకోని ఉమ్మడి ఆస్తిలో ఆడపిల్లలకీ మగవాళ్లతో సమానంగా పుట్టుకతోనే భాగం వస్తుందని చెప్పారు. కాబట్టి, మీ తాతగారి ఆస్తికి మీ మేనమామలు, అమ్మ, పిన్నులు లేదా వారి వారసులూ హక్కుదారులే. పార్టిషన్‌ కేసు 20 ఏళ్ల నుంచి ఎందుకు పెండింగ్‌లో ఉందో, ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసుకొని మంచి లాయర్‌ని సంప్రదించి త్వరగా తేల్చుకోవడానికి ప్రయత్నించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్