తెల్లబడటానికి.. ఇలా చేయొచ్చా?

మా అమ్మాయి వయసు 13. కొంచెం నల్లగా ఉంటుంది. తెల్లబడటానికి క్యారెట్‌ బాతింగ్‌ పౌడర్‌, రైస్‌ క్రీమ్‌ వాడాలను కుంటున్నా. ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా?

Updated : 25 Dec 2022 04:45 IST

మా అమ్మాయి వయసు 13. కొంచెం నల్లగా ఉంటుంది. తెల్లబడటానికి క్యారెట్‌ బాతింగ్‌ పౌడర్‌, రైస్‌ క్రీమ్‌ వాడాలను కుంటున్నా. ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా?

- ఓ సోదరి

రంగు గురించి ఆలోచించొద్దు.. చర్మం ఆరోగ్యంగా ఉందా లేదా అన్నదే ప్రధానం. క్యారెట్‌ బాతింగ్‌ పౌడర్‌ వల్ల నష్టమేమీ లేదు. కానీ అతిగా వాడితే మాత్రం చర్మం పొడిబారుతుంది. ఈ పౌడర్‌కి కొంచెం ఫ్రెష్‌ క్రీం కలిపి రాయండి.. సమస్య ఉండదు. ఇక రైస్‌ క్రీమ్‌.. దీనివల్లా తెల్లబడరు. చర్మం సాగడం తగ్గుతుంది.  వయసు పదమూడే! కాబట్టి, వాడాల్సిన అవసరం లేదు. వయసు ఇంకా చిన్నదే కాబట్టి, మంచి చర్మానికి ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టిపెట్టండి. రోజుకు 3-4 లీటర్లు నీరు తాగండి. చేప, నట్స్‌, పుచ్చ గింజలు, బాదం, వాల్‌నట్స్‌తో పాటూ కాలాలవారీ పండ్లను తినిపించండి. వీటి నుంచి అందే జింక్‌, మినరల్స్‌, విటమిన్‌ సి, ఇ చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మం కూడా మృదువుగా, ఆరోగ్యంగా మెరుస్తుంది. గ్రీన్‌టీని తేనెతో కలిపి తీసుకుంటే దాన్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ను దరి చేరనీయవు, తేమా అందుతుంది. ఈ వయసులో యాక్నే సమస్యలెక్కువ. బ్రకలీ, క్యాలీఫ్లవర్‌, చిలగడ దుంప, టొమాటో, బొప్పాయి, పెరుగు, పాలనూ తరచూ తినిపించండి. రోజూ చిన్నగ్లాసులో యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ ఒక టీ స్పూను కలిపి తాగిస్తే ఇన్‌ఫ్లమేషన్‌ సమస్య ఉండదు. రోజూ క్రమం తప్పక మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాయడం అలవాటు చేయండి. మేకప్‌కి వీలైనంత దూరంగా ఉంచండి. బయటకు వెళ్లొచ్చిన ప్రతిసారీ ముఖం కడుక్కొని ఐసు ముక్కతో ముఖమంతా రుద్దుకోమనండి. ఇంట్లో చేసిన పదార్థాలతోనే ప్యాక్‌లుగా వేసుకోవాలి. మొటిమలను గిల్లడం లాంటివీ చేయొద్దు. అప్పుడు మచ్చలు, గుంటలు లాంటివీ ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్