గర్భసంచి దృఢత్వానికి వీరభద్రాసనం

శారీరకంగా, మానసికంగా అలసిపోయే మనకి తరచు వెన్నునొప్పి వస్తుంటుంది. ఎక్కువసేపు నిలబడలేం. ఇతర అనారోగ్య సమస్యలూ దాడి చేస్తుంటాయి. వీటన్నిటినీ తరిమి కొట్టాలంటే వీరభద్రాసనం చేయండి.

Published : 07 Jan 2023 01:41 IST

శారీరకంగా, మానసికంగా అలసిపోయే మనకి తరచు వెన్నునొప్పి వస్తుంటుంది. ఎక్కువసేపు నిలబడలేం. ఇతర అనారోగ్య సమస్యలూ దాడి చేస్తుంటాయి. వీటన్నిటినీ తరిమి కొట్టాలంటే వీరభద్రాసనం చేయండి.

ఇలా చేయాలి ... ఇది నిలబడి చేసే ఆసనం. రెండు కాళ్లూ కొంచెం దూరంగా పెట్టి సౌకర్యంగా ఉండేట్లు చూసుకోవాలి. ఎడమ పాదాన్ని వెనుకవైపునకు జరపాలి. కుడికాలు అలానే ఉండాలి. పిరుదులను వీలైనంత కిందికి వంచాలి. కుడి మోకాలిని 90 డిగ్రీలు వంచాలి. ఎడమ మోకాలు వంచకుండా తిన్నగానే ఉండాలి. రెండు చేతులూ భుజాలకు సమాంతరంగా చాచి ఉంచి ముందుకు చూస్తుండాలి. వీరభద్రాసనంలో మోకాలి దాకా వంగి నిలబడితే మంచిది. లేదంటే మీకు కుదిరినట్లు చేయొచ్చు. ఈ భంగిమలో శ్వాస తీసుకుని వదులుతూ కనీసం 30 క్షణాలపాటు ఉంటే మంచిది. ఇదే విధంగా కుడి కాలును వెనక్కు జరిపి చేయాలి. ఇలా కాళ్లు మారుస్తూ 30 క్షణాల చొప్పున నాలుగు సార్లు చేయాలి.

ఇవీ లాభాలు...

తొడ నరాలు, కండరాలు బలోపేతం అవుతాయి. గర్భసంచి దృఢత్వాన్ని సంతరించుకుని కిందికి జారకుండా స్థిరంగా ఉంటుంది.

వెన్ను, చేతులు, భుజాలు, కాళ్లు, చీలమండలు బలాన్ని పుంజుకుంటాయి. నడుము నొప్పి రాదు.

పిరుదులు, ఉదరం, ఊపిరితిత్తులు బిగుసుకుపోవు.

సమతుల్యత అలవడుతుంది. స్థిరంగా ఉండగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది.

రక్తప్రసరణ బాగుంటుంది. శ్వాస ఇబ్బందులు తొలగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్