ఇవి సరిపోతాయా.. ఇంకేమైనా!

నా వయసు 14. స్కిన్‌ కేర్‌ తీసుకోవాలనుకుంటున్నా. ఫేస్‌వాష్‌, మాయిశ్చరైజర్‌, టోనర్‌ వాడాలనుకుంటున్నా.

Published : 08 Jan 2023 00:08 IST

నా వయసు 14. స్కిన్‌ కేర్‌ తీసుకోవాలనుకుంటున్నా. ఫేస్‌వాష్‌, మాయిశ్చరైజర్‌, టోనర్‌ వాడాలనుకుంటున్నా. ఇవి సరిపోతాయా? ఇంకేమైనా వాడాలా?

- ఓ సోదరి

ఇవి సరిపోతాయి.. అయితే అదనంగా సన్‌స్క్రీన్‌నీ చేర్చుకోండి. ఏవి ఎంచుకున్నా మీ చర్మానికి తగ్గవేనా అన్నది చెక్‌ చేసుకోవాలి. పొడిచర్మమైతే ఉత్పత్తుల్లో గాఢత తక్కువ ఉండేలా చూసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లున్న మాయిశ్చరైజర్‌ వాడండి. వారానికి రెండుసార్లు మల్టీవిటమిన్‌ మాస్క్‌ వేసుకుంటే చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. ఆలిగో పెప్టైడ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, హైలురోనిక్‌ యాసిడ్‌, బి5 ఉన్న క్రీములు మీకు సరిపోతాయి. నార్మల్‌ లేదా కాంబినేషన్‌ చర్మమైతే గాఢత తక్కువ ఫేస్‌వాష్‌, నూనెల్లేని మాయిశ్చరైజర్‌ వాడాలి. చార్‌కోల్‌ మాస్క్‌లు వారానికోసారి పెట్టుకుంటే చర్మం డిటాక్స్‌ అవుతుంది. హైలురోనిక్‌ యాసిడ్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ సి, అలోవెరా ఉన్న ఉత్పత్తులు మీకు మంచిది. జిడ్డు చర్మమైతే ఆయిల్‌ ఫ్రీ ఫేస్‌వాష్‌, మాటే తరహా మాయిశ్చరైజర్‌, జెల్‌ ఆధారిత సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడాలి. మీ ఉత్పత్తుల్లో సాల్సిలిక్‌ యాసిడ్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌, నియాసినమైడ్‌, మాండాలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ సి ఉండేలా చూసుకోండి. యాక్నే కూడా ఉంటే.. టీట్రీ ఆయిల్‌, రెటినాల్‌, విటమిన్‌ సి ఉన్నవి ఎంచుకోవాలి. కేవలం పూతలమీదే ఆధారపడొద్దు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంపైనా దృష్టిపెట్టండి. నీరు ఎక్కువగా తీసుకోండి.. సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్