దత్తత తీసుకున్న అమ్మాయికి ఆస్తి రాదా?

మా అక్క, బావలు.... పిల్లలు పుట్టడం లేదనే కారణంతో మా చిన్న పాపని ఇరవై ఏళ్ల క్రితం దత్తత తీసుకున్నారు.

Published : 24 Jan 2023 00:55 IST

మా అక్క, బావలు.... పిల్లలు పుట్టడం లేదనే కారణంతో మా చిన్న పాపని ఇరవై ఏళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. వారికి వారసులు లేనందున ఆస్తిలో వాటా ఇస్తామని చెప్పారు. తర్వాత వారికి బాబు పుట్టాడు. అప్పటి నుంచి వారిలో క్రమంగా మార్పు వచ్చింది. కానీ, మేం తప్పు పడుతున్నామనుకుంటారని ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్లు... అమ్మాయికి ఎటువంటి ఆస్తీ ఇవ్వమనీ, పెళ్లి బాధ్యత కూడా మమ్మల్నే తీసుకోమనీ చెబుతున్నారు. ఇప్పుడు వారి ఆస్తిలో ఆమెకు వాటా రాదా?

- ఓ సోదరి

పాపని దత్తత తీసుకున్నప్పుడు సంబంధిత నిబంధనల్ని అనుసరించారో లేదో తెలియాల్సి ఉంది. దాని ప్రకారం అడాప్షన్‌ డీడ్‌ రాసుకున్నారా? రాస్తే అందులో ఆస్తి ప్రస్తావన ఉందా? అన్నది గమనించుకోవాలి. అవన్నీ పద్ధతి ప్రకారం జరిగి ఉంటే కచ్చితంగా న్యాయం జరుగుతుంది. హిందూ అడాప్షన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ ప్రకారం దత్తత వచ్చిన బిడ్డలకు కన్న పిల్లలకు ఉన్న హక్కులన్నీ ఉంటాయి. ఇందులోని సెక్షన్‌ 21 ప్రకారం పిల్లలను పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఆస్తి యజమాని స్వార్జితం అయితే అతడు దాన్ని తనకు నచ్చిన ఎవరికైనా ఇవ్వొచ్చు. అయితే, పెళ్లి కాని ఆడపిల్లల బాధ్యత మాత్రం అమ్మానాన్నల మీదే ఉంటుంది. ఆస్తి వారి  పిత్రార్జితం అయితే అందులో కూడా హక్కు లభిస్తుంది. ముందు మీ అమ్మాయి చేత ఆస్తి కోరుతూ, పెళ్లి ఖర్చులు అడుగుతూ కేసు వేయించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్