అందరికన్నా చిన్న.. పెద్దదానిలా కనిపిస్తున్నా!

వయసు 33. ఈమధ్య బంధువులమంతా కలిశాం. కజిన్స్‌ అందరిలో నేనే చిన్న. కానీ వాళ్లందరి కంటే పెద్దదానిలా కనిపిస్తున్నా. అది చూసి అందరూ కాస్త శ్రద్ధ పెట్టు అని సలహా ఇచ్చారు. ముఖానికి క్రీమ్‌ రాస్తా.

Published : 05 Feb 2023 00:04 IST

వయసు 33. ఈమధ్య బంధువులమంతా కలిశాం. కజిన్స్‌ అందరిలో నేనే చిన్న. కానీ వాళ్లందరి కంటే పెద్దదానిలా కనిపిస్తున్నా. అది చూసి అందరూ కాస్త శ్రద్ధ పెట్టు అని సలహా ఇచ్చారు. ముఖానికి క్రీమ్‌ రాస్తా. అది చాలదా? నాది పొడిచర్మం. నుదుటిపై ముడతలొచ్చాయి. అసలు నేనేం వాడాలి?

- ఓ సోదరి

పొడిచర్మం కావడం వల్లే త్వరగా ముడతలు. వయసు చిన్నదే.. కాబట్టి ‘ప్రిమెచ్యూర్‌ రింక్లింగ్‌’ అంటాం. వంశపారంపర్యం, ఎండలో ఎక్కువగా తిరగడం, కాస్మెటిక్స్‌ వాడి శుభ్రం చేసుకోకుండా పడుకోవడం.. ఇవన్నీ ఇందుకు దారితీసేవే. తక్కువ మొత్తంలో ఉంటే క్రీములతోనే తగ్గించుకోవచ్చు. క్రీమ్‌ ఆధారిత మాయిశ్చరైజర్‌ వాడండి. వాటిలో నియాసినమైడ్‌, ఓట్‌మీల్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌, హైలురోనిక్‌ యాసిడ్‌, పెప్టైడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, రెటినాల్‌ వంటివి ఉండేలా చూసుకోండి. వీటితోపాటు సన్‌స్క్రీన్‌ తప్పక వాడాలి. డర్మాబ్రేషన్‌, మైక్రోడర్మాబ్రేషన్‌, కెమికల్‌ పీల్స్‌, లేజర్‌, ఇంజెక్టబుల్‌ ఫిల్లర్స్‌, బొటాక్స్‌ ద్వారా ముడతలు కనిపించకుండా చేయొచ్చు. ముఖ కవళికల వల్ల వచ్చినవైతే కనిపించకుండా ఆరునెలలకోసారి బొటాక్స్‌ చేయించుకోవచ్చు. దీనివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ ఉండవు. శాశ్వతంగా వచ్చినవి అయితే ఫిల్లర్స్‌, మైక్రోనీడ్లింగ్‌ అవసరమవుతాయి. సహజంగా.. ఆలివ్‌ ఆయిల్‌, తేనె, గ్లిజరిన్‌ కలిపి రోజూ రెండుసార్లు రాసుకొని పావుగంటయ్యాక కడిగేయండి. చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. కలబందను రాసి, 10 నిమిషాలయ్యాక కడిగితే చర్మంలో సాగే గుణం మెరుగవుతుంది. అరటిపండు, అవకాడో గుజ్జు, తేనె చెంచా చొప్పున తీసుకొని ముఖానికి పట్టించి 20 నిమిషాలయ్యాక కడిగేయాలి. వీటితోపాటు ఒత్తిడి తగ్గించుకోవడం, విటమిన్‌ సి ఎక్కువగా ఉండే నిమ్మఫలాలు, ద్రాక్ష, బెర్రీ, తాజా పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవడం, కనీసం 7 గంటల నిద్ర ఉండేలా చూసుకుంటే ముడతల్ని అదుపు చేయొచ్చు. ముఖ కవళికలనీ చెక్‌ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్