చెమట.. దుర్వాసన!

ఎండాకాలం వచ్చిందంటే చెమట దుర్వాసన. పెర్‌ఫ్యూమ్‌ వాడినా ప్రయోజనం తక్కువే. పోగొట్టుకునేమార్గాలున్నాయా?

Published : 26 Feb 2023 00:16 IST

ఎండాకాలం వచ్చిందంటే చెమట దుర్వాసన. పెర్‌ఫ్యూమ్‌ వాడినా ప్రయోజనం తక్కువే. పోగొట్టుకునే మార్గాలున్నాయా?

- ఓ సోదరి

రీరంలో ఎక్రైన్‌, ఎపోక్రైన్‌ అనే రెండు రకాల స్వేదగ్రంథులు ఉంటాయి. ఎక్రైన్‌ గ్రంథులు శరీరమంతా ఉంటాయి. ఇవి శరీర వేడిని అదుపు చేస్తుంటాయి. ఇవి వాసనకు కారణమవ్వవు. ఎపోక్రైన్‌ గ్రంథుల నుంచి విడుదలయ్యే చెమటతోనే సమస్య. ఇవి బాహుమూలలు, జననేంద్రియాల్లో ఉంటాయి. నిజానికి దుర్వాసనకు చెమట కారణం అనుకుంటాం కానీ కాదు. చెమటకు శరీరం మీది బ్యాక్టీరియా తోడవడం వల్లే ఇలా చెడువాసన. కొందరిలో హార్మోనుల్లో అసమతుల్యత, తీసుకునే ఆహారం, ఇన్ఫెక్షన్లు, మధుమేహం, మెనోపాజ్‌, హైపర్‌ థైరాయిడిజం వంటి కొన్ని అనారోగ్య సమస్యలూ కారణాలే! ఉల్లి, క్యాబేజీ, మాంసం, వెల్లుల్లి, కెఫిన్‌ ఎక్కువగా తీసుకునేవాళ్లలోనూ, సరిగా స్నానం చేయనివాళ్లలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. వ్యక్తిగత శుభ్రత ప్రధానం. రెండు పూటలా స్నానం, బాహుమూలలు, జననేంద్రియాలను సరిగా శుభ్రం చేసుకోవడంపై దృష్టిపెట్టండి. జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోండి. అనారోగ్య సమస్యలేమైనా ఉన్నాయేమో చెక్‌ చేయించుకోండి. కారం, వాసనకు కారణమయ్యే ఆహారపదార్థాలు, ఒత్తిడిని తగ్గించుకుంటే మేలు. ఇంకా స్నానానికి యాంటీ బ్యాక్టీరియల్‌ లేదా బెంజైల్‌ పెరాక్సైడ్‌ సబ్బులను వాడండి. బాహుమూలల్లో వెంట్రుకలను తొలగించుకోవడం, కాటన్‌, వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవడం మేలు. టాపికల్‌ యాంటీ పర్‌స్ప్రెంట్‌ వాడొచ్చు. సమస్య ఎక్కువగా ఉంటే బొటాక్స్‌ ఇంజెక్షన్లు చేయించుకోవచ్చు. అయితే ఏడాదికోసారి తప్పక కొనసాగించాలి. బాహుమూలల్లో బేకింగ్‌ సోడాకు తగినన్ని నీళ్లు కలిపి లేదా చల్లారిన గ్రీన్‌టీని రాసి, ఆరాక కడిగేయాలి. ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌, నీళ్లు కలిపి లేదా నిమ్మరసంలో నీళ్లు కలిపి గంటకోసారి అయినా స్ప్రే చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్