అస్తమానూ రాయలేకపోతున్నా!

కాలమేదైనా పెదాలు పొడిబారుతుంటాయి. లిప్‌బామ్‌ రాసినా కొద్దిసేపే ప్రభావం. అస్తమానూ రాయలేక చిరాకొస్తోంది. ఎక్కువ సమయం తేమగా ఉండే మార్గాలు సూచించండి.

Updated : 07 Mar 2023 00:24 IST

కాలమేదైనా పెదాలు పొడిబారుతుంటాయి. లిప్‌బామ్‌ రాసినా కొద్దిసేపే ప్రభావం. అస్తమానూ రాయలేక చిరాకొస్తోంది. ఎక్కువ సమయం తేమగా ఉండే మార్గాలు సూచించండి.

- రజని

పొడిచర్మం ఉన్నవారిలో ఇది సాధారణం. పెదాలమీది చర్మం చాలా పలుచగా ఉంటుంది. శరీరంలో ఏ రకమైన మార్పులొచ్చినా ప్రభావం వీటి మీదే పడుతుంది. పైగా వీటికి నూనె గ్రంథులుండవు. కొందరు పెదాలను తడపడం, కొరకడం లాంటివి చేస్తుంటారు. ఇదీ పొడిబారడానికి కారణమే! అలర్జీలు, హైపోథైరాయిడిజం, ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌, విటమిన్‌, ఐరన్‌ లోపం, సరిగా నీళ్లు తీసుకోకపోవడం వల్లా ఈ సమస్య ఉంటుంది. వాతావరణ మార్పుల ప్రభావమూ పెదాల మీద ఎక్కువే. వైద్య పరిభాషలో దీన్ని కిలైటిస్‌ అంటాం. ఎండలో ఎక్కువగా తిరగడం, వైరల్‌, బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌, లిప్‌బామ్‌, లిప్‌స్టిక్‌, ఏవైనా ఆహార పదార్థాలు పడకపోవడం, ఓరల్‌ రెటినాల్‌ వంటి కొన్ని రకాల ఔషధాలు వాడుతున్నా పెదాలు పొడిబారుతుంటాయి. ఎక్కువగా నీళ్లు, ద్రవ పదార్థాలను తీసుకోండి. గదిలో హ్యుమిడిఫయర్‌ని ఏర్పాటు చేసుకోండి. పెదాలను తడపడం, చర్మాన్ని తొలగించడం లాంటివి చేయొద్దు. సువాసనల్లేని హైపోఅలర్జిక్‌, గ్లిజరిన్‌, మినరల్‌ ఆయిల్‌, సెరమైడ్స్‌, జింక్‌ ఆక్సైడ్‌, టైటానిక్‌ ఆక్సైడ్‌, ఎస్‌పీఎఫ్‌ ఉన్న లిప్‌బామ్‌లను ఎంచుకోండి. ఫ్రూట్‌, ఫ్లవర్‌ ఫ్లేవర్లు, మెంతాల్‌, యూకలిప్టస్‌, వ్యాక్స్‌లు ఉన్నవాటికి దూరంగా ఉండండి. ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం లేవగానే తప్పకుండా లిప్‌బామ్‌ రాయండి. ముందు ఎవరో
ఏదో అనుకుంటున్నారని పట్టించుకోవడం మానేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్