షాంపూ.. సహజంగా!

బాగా చుండ్రు, జుట్టు రాలుతోంది. సహజ పోషకాలున్న షాంపూ వాడాలనుంది. ఏవి ఎంచుకుంటే మేలు?

Published : 26 Mar 2023 00:25 IST

బాగా చుండ్రు, జుట్టు రాలుతోంది. సహజ పోషకాలున్న షాంపూ వాడాలనుంది. ఏవి ఎంచుకుంటే మేలు?

- ఓ సోదరి

తల చర్మం పొడిబారడం, షాంపూ, కండిషనర్‌ చేశాక సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, పదే పదే తలను గట్టిగా దువ్వడం, గీకడం వంటివాటివల్ల చుండ్రు వస్తుంటుంది. ఎగ్జిమా, స్కాల్ప్‌ సొరియాసిస్‌, కొన్ని ఉత్పత్తులు పడకపోవడం, ఫంగస్‌లూ దీనికి కారణమే! తరచూ తలస్నానం చేయాలి. షాంపూల్లో జింక్‌ పైరథాయిన్‌, సాల్సిలిక్‌ యాసిడ్‌, సెలీనియం సల్ఫైడ్‌, కీటోకానజాల్‌ ఉన్నవి ఎంచుకోవచ్చు. సహజ ఉత్పత్తుల కోసం చూస్తోంటే టీట్రీ ఆయిల్‌, గుడ్డు సొన, వెనిగర్‌, ఆరెంజ్‌ పీల్‌ ఉన్న షాంపూలు వాడండి. ఇంకా గోరువెచ్చని కొబ్బరినూనెకు నిమ్మరసం కలిపి, మాడుకి పట్టించి, మసాజ్‌ చేయాలి. అరగంటయ్యాక షాంపూచేస్తే సరి. బేకింగ్‌ సోడా తల చర్మం పీహెచ్‌ని సమన్వయం చేస్తూనే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌నీ తగ్గిస్తుంది. దీన్ని తగినంత తీసుకొని తలమీద చల్లి, రుద్దాలి. కొద్దిసేపయ్యాక షాంపూ లేకుండా గోరువెచ్చని నీటితో కడిగేయాలి.  కురులకు పెరుగు కావాల్సిన తేమనివ్వడమే కాదు.. ఫంగస్‌లనూ దూరం చేస్తుంది. వేపాకులను మిక్సీలోవేసి తలకు పట్టించుకున్నా మంచిదే. వీటిని వారానికి రెండుసార్లు ప్రయత్నించొచ్చు. ఇక శిరోజాలు రాలడానికి బోలెడు కారణాలు. కేవలం షాంపూనే వాడటం, కండిషనర్‌ వాడకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, తలకు ఉపయోగించే ఉత్పత్తులు పడకపోవడం, హార్మోనుల్లో అసమతుల్యత, పీసీఓఎస్‌, కొన్ని అనారోగ్యాలూ కారణమే! వీటినోసారి చెక్‌ చేయించుకోండి. కేవలం ఉత్పత్తులే కాదు.. రోజూ పోషకాహారాన్నీ తీసుకోండి. అప్పుడే సమస్య దూరమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్