ఆడపడుచు తీరుని అడ్డుకునేదెలా?

మా ఆడపడుచు కుటుంబంతో సహా మా ఊరు కాపురం వచ్చేసింది. అంతేకాదు భార్యాభర్తలిద్దరూ మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. మా వారిని చేతకాని వ్యక్తిగా, నన్ను ఆ ఇంటికి సరిపడని కోడలిగా  అత్తమామల ఎదుట చిత్రీకరిస్తున్నారు. మా మాటకు విలువ లేకుండా ప్రతి విషయంలో అడ్డుపడుతున్నారు.

Updated : 04 Apr 2023 00:57 IST

మా ఆడపడుచు కుటుంబంతో సహా మా ఊరు కాపురం వచ్చేసింది. అంతేకాదు భార్యాభర్తలిద్దరూ మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. మా వారిని చేతకాని వ్యక్తిగా, నన్ను ఆ ఇంటికి సరిపడని కోడలిగా  అత్తమామల ఎదుట చిత్రీకరిస్తున్నారు. మా మాటకు విలువ లేకుండా ప్రతి విషయంలో అడ్డుపడుతున్నారు. ఈ సూటిపోటి మాటలూ, అవమానాలు భ¡రించలేకపోతున్నా. మరో పక్క మా ఆస్తిలో కొంత భాగం రాసివ్వమని పదే పదే తండ్రిని కోరుతోంది. నేను తనపై గృహహింస కేసు పెట్టొచ్చా? ఈ విషయంలో చట్టం ఏవిధంగా సాయం చేస్తుంది?

- ఓ సోదరి

మీ సమస్య అనుబంధాలకు సంబంధించినది. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య విభేదాలకు మూడో వ్యక్తి ప్రమేయమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మీ విషయానికొస్తే... ఆ మూడోవ్యక్తి బయటివారైనా, మీ బంధాలు చెడిపోయే స్థితిలోఉన్నా, మిమ్మల్ని కేసు వేయమని సలహా ఇవ్వొచ్చు. ఇక్కడ కలతలు రేపుతున్నది మీ ఆడపడుచే అంటున్నారు. ఆమె తన భర్త చెప్పు చేతల్లో ఉండి మీ అత్తమామలతో ఇలా మాట్లాడుతుందేమో గమనించండి. ఒకవేళ ఆవిడ మీద కేసేస్తే మీ అత్తమామలకు కోపం వచ్చి మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టే పరిస్థితులేమైనా ఎదురవుతాయేమో చూడండి. కూతురు మీద మమకారం ఏ తండ్రికైనా ఉంటుంది కదా! అంతేకాదు, కేసుల దాకా వెళ్తే వాళ్లమీద సానుభూతి పెరిగి మీరు చెడ్డవాళ్లయ్యే అవకాశమూ ఉంది. ముందుగా మధ్యవర్తుల ద్వారా మీ మామగారికి మంచేదో, చెడేదో చెప్పించండి. అల్లుడు ఏ ఉద్యోగం చేయకుండా భార్య తెచ్చే ఆస్తిమీద ఆశపెట్టుకున్నాడన్న సంగతి ఆయనికి తెలిసేలా చేయండి. ఇక, వారు మిమ్మల్ని సూటిపోటి మాటలతో వేధిస్తున్న విషయాన్ని మీకు దగ్గర్లోని ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌లో ఫిర్యాదు చేయండి. వాళ్లు పిలిచి కౌన్సెలింగ్‌ చేస్తే మార్పు రావొచ్చు. ఇవేమీ పనిచేయకపోతే... గృహహింస చట్టం కింద కేసుపెట్టొచ్చు. మానసిక క్షోభ కలిగించకుండా రక్షణ కోరవచ్చు. అక్కడ కూడా కౌన్సెలింగ్‌ ద్వారా మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్