విపరీతంగా చెమట!

నాకు వేసవి భయం. ఏసీ గదిలోంచి అలా అడుగు బయట పెట్టానంటే చాలు. విపరీతంగా చెమట పోస్తుంది. దుర్వాసన వస్తుందేమో అని భయం. తగ్గించుకునే మార్గాలున్నాయా?

Published : 16 Apr 2023 00:51 IST

నాకు వేసవి భయం. ఏసీ గదిలోంచి అలా అడుగు బయట పెట్టానంటే చాలు. విపరీతంగా చెమట పోస్తుంది. దుర్వాసన వస్తుందేమో అని భయం. తగ్గించుకునే మార్గాలున్నాయా?

- ఓ సోదరి

చెమట ఒక్కదాని వల్లే దుర్వాసన రాదు. బ్యాక్టీరియాతో కలిస్తేనే సమస్య. చిన్నపిల్లల్లో ఈ సమస్య ఉండదు. యవ్వనంలోకి వచ్చాకే దుర్వాసన ప్రారంభమవుతుంది. తీసుకునే ఆహారం, శరీర శుభ్రతపై దృష్టిపెట్టండి. హైపర్‌ హైడ్రాసిస్‌ ఉందేమో చెక్‌ చేయించుకోండి. ఎక్కువగా వ్యాయామం చేసేవారికి, ఒత్తిడి, అధిక బరువున్నా చెమట ఎక్కువగా పోస్తుంటుంది. మధుమేహం, మెనోపాజ్‌, థైరాయిడ్‌ వంటివీ కొన్నిసార్లు ఈ సమస్యకు కారణాలే. అలాగని దాన్ని చెడ్డదానిలా చూడొద్దు. వేడి నుంచి చెమటే శరీరాన్ని చల్లబరుస్తుంది. అతిగా పోస్తోంది అంటున్నారు కాబట్టి.. యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ కలిపిన నీరు, గ్రీన్‌ టీని తరచూ తీసుకోండి. కొంతమేర ఉపశమనం ఉంటుంది. బేకింగ్‌ సోడాలో నీళ్లు కలిపి బాహుమూలల్లో రాయండి. యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ లేదా నిమ్మరసాన్ని కలిపిన నీటితో స్నానం చేసినా మంచిదే. అధిక స్వేదాన్ని అరికట్టడమే కాదు.. దుర్వాసననీ దరిచేరనీయవు. వీటితోపాటు రెండు పూటలా యాంటీ బ్యాక్టీరియల్‌ సబ్బుతో తప్పక స్నానం చేయాలి. చెమటను పీల్చే, వదులుగా ఉండే కాటన్‌ వస్త్రాలను ఎంచుకోండి. బొటాక్స్‌ చేయించుకోవడం ద్వారా కూడా అధిక చెమట నుంచి బయటపడొచ్చు. టాపికల్‌ యాంటీ పర్‌స్పరెంట్లు వాడినా మంచిదే. వీటితోపాటు ఉల్లి, వెల్లుల్లి, రెడ్‌ మీట్‌, క్యాబేజ్‌, బ్రకలీ, క్యాలిఫ్లవర్‌, కెఫిన్‌, ఎక్కువ కారం వంటివాటికి దూరంగా ఉంటే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్